Anvesh on Uppal Balu (image credit:Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Anvesh on Uppal Balu: నా అన్వేష్ పొగడ్తలు.. ఉప్పల్ బాలు లైఫ్ లో అన్నీ కష్టాలేనా?

Anvesh on Uppal Balu: ఇటీవల నోరు తెరిస్తే బూతులు మాట్లాడే నా అన్వేషణ నోట.. మంచి పలుకులు వచ్చాయి. బెట్టింగ్ యాప్ లను ప్రమోషన్స్ చేస్తున్న వారిపై గుర్రుమంటున్న నా అన్వేష్, ఒక్కసారిగా మాట మార్చి, పొగడ్తల వర్షం కురిపించారు. ఇదేంటి.. ఇదేమి వెరైటీ అనుకుంటున్నారా? లేదు లేదు ఇందులో ఓ చిన్న మతలబు ఉంది. ఇంతకు పొగిడింది ఎవరినో తెలుసా.. సోషల్ మీడియాలో ఫేమస్ గా మారి, పలు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు వేసి మెప్పించిన ఉప్పల్ బాలునే. ఔను ఉప్పల్ బాలును ఉద్దేశించి నా అన్వేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దీనితో నెటిజన్స్ కూడా ఉప్పల్ బాలు నువ్వు సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. అలాగే ఉప్పల్ బాలు జీవితాన్ని తెలుసుకొని ఔరా అనేస్తున్నారు.

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ మీద నా అన్వేషణ ఫైర్ అవుతున్నారు. అనధికార బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తూ, ఎందరో యువకుల జీవితాలు బుగ్గిపాలు కావడంలో వీరి పాత్ర కీలకమన్నది నా అన్వేష్ వాదన. ఆ వాదన నిజమనేలా ఇటీవల ఎందరో యువకులు బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

సోషల్ మీడియా లో ఫాలోవర్స్ వచ్చిన వెంటనే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడం, అందిన కాడికి దండుకోవడం ఇది కొంత మంది ఇన్ ఫ్లూయెన్సర్స్ పనిగా మారింది, మాకు ఏముంది.. మా డబ్బులు మాకు వచ్చాయి అనే రీతిలో కొందరు ఫేక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడమే ఈ వివాదానికి అసలు కారణం.

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల బెట్టింగ్ భూతంపై సమరం ప్రకటించారు. దీనితో నా అన్వేష్ కూడా జత కలిసి బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అంతవరకు ఓకే గానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సాగించే ఇన్ ఫ్లూయెన్సర్స్ ను ఉద్దేశించి నా అన్వేష్ చేసిన కామెంట్స్ మాత్రం కాస్త విరుద్దంగా ఉన్నాయని పలువురి అభిప్రాయం.

విమర్శలు చేసే సమయంలో కాస్త ఆచితూచి మాట్లాడాలని నా అన్వేష్ కు పలువురు సూచిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి నా అన్వేష్.. సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సంపాదించుకున్న ఉప్పల్ బాలును పొగుడుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఉప్పల్ బాలు వ్యక్తిత్వానికి నిదర్శనమని నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఉప్పల్ బాలు గురించి నా అన్వేష్ ఏమి చెప్పారంటే.. సాధారణంగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ కు కోట్లు ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు బుట్టలో వేసుకుంటారని, అందుకు ఆశ పడ్డవారు ప్రమోషన్స్ చేసి తెగ సంపాదించుకున్నారన్నారు. ఇదే రీతిలో ఉప్పల్ బాలు ఫేమ్ చూసి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు సంప్రదించినా, నో.. నేను అలా చేయను.. లక్షలు, కోట్లు ఇచ్చినా.. ఆ పాపం చేయనని ఉప్పల్ బాలు తనతో చెప్పినట్లు నా అన్వేష్ చెప్పారు.

Also Read: David Warner: తొలి మూవీతోనే యమ క్రేజ్.. వార్నర్ కు తెలుగు ప్రేక్షకుల వింత రిక్వెస్ట్!

ఉప్పల్ బాలు సామాన్య జీవితం గడుపుతున్నా, తన అన్న ఆటో నడుపుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నా, ఏమాత్రం డబ్బుకు ఆశపడని గుణం ఉప్పల్ బాలు సొంతమని నా అన్వేష్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ కావడంతో, కష్టాల్లో ఉన్నా ఉప్పల్ బాలు, సమాజం కోసం ఆలోచించి యాప్స్ ప్రమోషన్ చేయకపోవడం అతని మంచితనానికి నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా ఉప్పల్ బాలు మజాకా.. నువ్వు సూపర్ అనేస్తున్నారు మరికొందరు. అయితే నా అన్వేష్ ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ సాయం అందించడం విశేషం. ఉప్పల్ బాలుకు ఐ ఫోన్ సాయం చేశారని ఓ ఇంటర్వ్యూలో ఉప్పల్ బాలు చెప్పారు.

 

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

 

learnwithsai (@learnwithsaiii) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?