Sonakshi Sinha with Wife (Image Source: Instagram)
ఎంటర్‌టైన్మెంట్

Sonakshi Sinha: వరల్డ్ రికార్డ్.. 16 నెలలుగా ప్రెగ్నెన్సీ ప్రచారంపై సోనాక్షి సిన్హా స్ట్రాంగ్ కౌంటర్!

Sonakshi Sinha: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) తన వ్యక్తిగత జీవితంపై నిత్యం మీడియాలో జరుగుతున్న ప్రచారానికి, వదంతులకు విసుగు చెంది, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా పోస్ట్‌తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దాదాపు 16 నెలలుగా తాను గర్భవతినంటూ (ప్రెగ్నెంట్) మీడియాలో జరుగుతున్న ఊహాగానాలకు, కథనాలకు ఈ పోస్ట్ ద్వారా ఆమె చురకలు అంటించింది. ఈ పోస్ట్ చూసిన వారెవరైనా సరే.. ఇకపై ఆమె గర్భవతి అని రాయడానికి సాహసం చేయకపోవచ్చు. అంత చమత్కారంగా ఆమె ఈ పోస్ట్‌లో రియాక్ట్ అయింది.

Also Read- Jatadhara Movie: కసబ్ గారూ.. ‘ఓజీ’ సినిమా చూశారా! క్లాసిక్ హారర్ సెటప్‌తో ‘జటాధర’ ప్రమోషన్స్ షురూ!

ప్రపంచ రికార్డ్ హోల్డర్ ఫర్ లాంగెస్ట్ ప్రెగ్నెన్సీ

తాజాగా ఆమె తన భర్తతో కలిసి ఓ వేడుకకు హాజరైంది. అక్కడి ఫోటోలను షేర్ చేసి.. సోనాక్షి ఇచ్చిన క్యాప్షన్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘‘మా ప్రియమైన, అతి తెలివైన మీడియాకు.. కేవలం నడుముపై చేయి వేసి పోజు ఇచ్చినందుకు, నేను మానవ చరిత్రలోనే అత్యంత ఎక్కువ రోజులు గర్భధారణ (16 నెలలు.. ఇంకా పెరుగుతూనే ఉంది) కలిగి ఉన్నందుకు ప్రపంచ రికార్డును నెలకొల్పిన దానిని’’ అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. మీడియా తన శరీర భాషను, పోజులను తప్పుగా అర్థం చేసుకుని, నిరంతరం అవాస్తవ ప్రచారం చేస్తుండటంపై ఆమె ఈ విధంగా చురకలు వేసింది. ‘మా రియాక్షన్‌కి చివరి స్లైడ్‌ను స్క్రోల్ చేయండి… ఆ తర్వాత ఈ దీపావళిని ఆనందంగా కొనసాగించండి’ అంటూ చమత్కరించింది. చివరి స్లైడ్‌లో ఆమె తన భర్తతో కలిసి హాయిగా నవ్వుకుంటోంది. ఈ పోస్ట్‌తో తాను ప్రెగ్నెంట్ కాదనే విషయాన్ని స్పష్టం చేయడమే కాకుండా, తన గురించి రాస్తున్న కథనాల పట్ల ఆమె ఎంత అసహనంగా ఉందో పరోక్షంగా తెలియజేసింది.

Also Read- Clapboard: సినిమా షూటింగ్‌లో ‘క్లాప్’ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న కీలక రహస్యమిదే!

16 నెలలుగా ప్రచారం ఎందుకు?

కొంతకాలంగా సోనాక్షి ఏదైనా ఫోటోషూట్ లేదా ఈవెంట్‌లో కాస్త వదులుగా ఉండే దుస్తులు ధరించినా, పొట్టపై చేయి వేసినట్టు పోజు ఇచ్చినా వెంటనే ‘ప్రెగ్నెంట్’ అంటూ మీడియా, సోషల్ మీడియాలలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యలో చాలా సార్లు వివరణ ఇచ్చినా, అలాంటి వాటిని అసలు పట్టించుకోను అని చెప్పినా కూడా ఆ రూమర్స్ ఆగలేదు. ఫైనల్‌గా అవి రూమర్స్ అని తెలుపుతూ.., కేవలం ఒక పోజు ఆధారంగా ఇలా ప్రచారం చేయడం సరికాదని సోనాక్షి తన పోస్ట్ ద్వారా నవ్వుతూనే గట్టిగా సమాధానం ఇచ్చింది. సోనాక్షి ఈ దీపావళి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ, ఈ వదంతులను పట్టించుకోవద్దని పరోక్షంగా కోరింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై మీడియా అతిగా దృష్టి సారించడంపై జరుగుతున్న చర్చకు ఆజ్యం పోసింది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..