Draupathi2: నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీకి మోహన్. జి (Mohan G) దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నెలరాజె..’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట విడుదల అనంతరం సింగర్ చిన్మయి (Singer Chinmayi) క్షమాపణలు చెబుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. ఈ పాటను తనే ఆలపించింది. అదేంటి.. పాట పాడిన సింగర్ క్షమాపణలు చెప్పడం ఏమిటి? అని అంతా ఆశ్చర్యపోవచ్చు. క్షమాపణలు చెబుతూ.. ‘రికార్డింగ్ సమయంలో ఈ సినిమా భావజాలం, దాని నేపథ్యం గురించి నాకు తెలియకపోవటం వల్ల పాల్గొన్నాను. ఈ ప్రాజెక్ట్ గురించి ముందే తెలిసి ఉంటే మాత్రం కచ్చితంగా ఇందులో ఇన్‌వాల్వ్ అయ్యేదాన్ని కాదు’ అని సంగీత దర్శకుడు జిబ్రాన్ పేరును కూడా ఆమె ట్వీట్‌లో మెన్షన్ చేశారు.
వివరణ ఇవ్వాలి లేదా ట్వీట్‌ను తొలగించాలి
సింగర్ చిన్మయి చేసిన ఈ ట్వీట్‌కు దర్శకుడు హర్టయ్యారు. చిన్మయి క్షమాపణ చెప్పడంపై చిత్ర దర్శకుడు మోహన్.జి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఈ పాటను పాడటానికి నేను పర్సనల్‌గా చిన్మయి అయితే బావుంటుందని భావించి ఆమెతో పాడించాను. రికార్డింగ్ సమయంలో చిత్ర సంగీత దర్శకుడు జిబ్రాన్ అందుబాటులో లేకపోవటంతో నేను ట్రాక్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే వివరించాను. సినిమా కాన్సెప్ట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదు. నాతో కానీ, సంగీత దర్శకుడితో కానీ మాట్లాడకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా ఇలాంటి కామెంట్స్ చేయటం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనిపై చిన్మయి వివరణ ఇవ్వాలి లేదా వెంటనే ట్వీట్‌ను తొలగించాలి’’ అని దర్శకుడు పోస్ట్ చేశారు. ఈ విషయంపై ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను కాకుండా తనను విమర్శించాలని.. సినిమా మేకింగ్‌లో భాగమైన ఇతరులను విమర్శించటం పిరికితనమని ఈ సందర్భంగా దర్శకుడు మోహన్.జి పేర్కొన్నారు.
ఇప్పుడెందుకు సారీ
దీంతో ఇప్పుడీ సినిమాకు సంబంధించి బాగా చర్చలు నడుస్తున్నాయి. అసలు ఈ పాటలో ఏముంది? అంతగా చిన్మయికి నచ్చని విధంగా ఏం చేశారు?, అసలు అలాంటి సింగర్‌లో ఎందుకు పాడించుకున్నారు? అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో సింగర్ చిన్మయి పేరు ఏ విధంగా వార్తలలో నిలుస్తుందో తెలియంది కాదు. పిల్లలపై, ఆడవాళ్లపై నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్లకి, మరీ ముఖ్యంగా తనని టార్గెట్ చేసే వాళ్లకి ఆమె డైరెక్ట్‌గానే ఇచ్చి పడేస్తుంది. అలాంటి చిన్మయి.. పాట గురించి తెలుసుకోకుండా ఎలా పాడింది? పాడే సమయంలోనైనా ఆ పాట గురించి తెలుస్తుంది కదా. అప్పుడు పాడేసి.. ఇప్పుడెందుకు సారీ చెబుతుంది.. ఆమె హేటర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ స్టార్ట్ చేశారు. చూద్దాం.. మరి చిన్మయి ఈ వివాదాన్ని ఇంకా పెద్దది చేస్తుందో.. లేదంటే కామ్‌గా డిలీట్ చేస్తుందో.
Don’t target any Technicians, Actors, actresses and who ever work with me in #Draupathi2.. Whatever my movie speaks it’s my own creation and idealogy. Your target is me.. Don’t target those associated Directly or indirectly with me and my projects.. It’s a kind of cowardness..
— Mohan G Kshatriyan (@mohandreamer) December 1, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
