War 2 Official Teaser( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

War 2 Official Teaser: ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ బిగ్ షాక్ ఇచ్చాడుగా.. వార్ 2 లో తారక్ రోల్ ఇదే!

War 2 Official Teaser: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్‌ రోషన్ కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ మూవీకి అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వహించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ న‌టిస్తున్న ఈ మూవీని య‌శ్ రాజ్ ఫిల్మ్స్ కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఎన్టీఆర్‌, హృతిక్ క‌లిసి ఒకే స్క్రీన్ పై కనిపించనుండటంతో ఫ్యాన్స్ లో భారీ అంచ‌నాలే నెలకొన్నాయి. వరల్డ్ వైడ్ గా ఆగ‌స్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Also Read: Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు.. కేసీఆర్, హరీష్ రావును విచారించే అవకాశం?

ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సంద‌ర్భంగా వార్ 2 టీజ‌ర్‌ ను విడుద‌ల చేశారు. దీంతో, ఫ్యాన్స్ లో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, గత కొంతకాలం నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా అన్నను విలన్ లో చూడలేము. హీరోగా మాత్రమే చూడగలము అంటూ ట్వీట్స్ పెట్టారు. కట్ చేస్తే ఈ రోజూ రిలీజ్ చేసిన టీజర్ లో ” నా క‌ళ్లు నిన్ను ఎప్ప‌టి నుంచో వెంటాడుతున్నాయి క‌బీర్ అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. అంటే.. ఈ మూవీలో ఎన్టీఆర్ విలన్ పాత్ర చేస్తున్నారని ఈజీగా తెలిసిపోతుంది. చివర్లో గెట్ రెడీ ఫర్ వార్ అంటూ డైలాగ్ చెప్పడంతో.. ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ఇక ఎన్టీఆర్‌, హృతిక్ మ‌ధ్య వ‌చ్చే ఫైటింగ్ టీజ‌ర్‌కే హైలెట్ అనినిలుస్తాయని అంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?