Viraatapalem PC Meena Reporting SM
ఎంటర్‌టైన్మెంట్

Viraatapalem: వ్యవహారం కోర్టులో ఉంది.. ఇప్పుడేం మాట్లాడం.. ఓటీటీ టీమ్!

Viraatapalem: రెండు రోజుల క్రితం ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్‌కు సంబంధించి ఈటీవీ విన్ టీమ్ మీడియా సమావేశం నిర్వహించి జీ5కి చెందిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’పై కథ కాపీ అంటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ కాపీపై కోర్టులోనే తేల్చుకుంటామని వారు మీడియా ముందు తెలిపారు. వారి మీడియా సమావేశం తర్వాత జీ5 టీమ్ ఎక్కడా స్పందించలేదు. దీంతో అందరూ నిజంగానే కథని కాపీ చేశారని అనుకున్నారు. కానీ, ఇది తమ ఒరిజినల్ కథ అని, అందుకే పరువు నష్టం దావా వేశామని తాజాగా ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ (Viraatapalem: PC Meena Reporting) సక్సెస్ మీట్‌లో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ పేర్కొన్నారు. వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టే.. మేం కామ్‌గా ఉన్నామని ఆమె వివరణ ఇచ్చారు.

Also Read- Samantha and Sreeleela: ‘ఊ అంటావా’ భామతో ‘కిస్సిక్’ పాప.. స్టన్నింగ్ అవతారాల్లో!

ఈ కార్యక్రమంలో జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ.. నాకు స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడే అలవాటు లేదు. జీ తెలుగు సంస్థకు ఇది 20వ వసంతం. ఈ జర్నీలో మాకు మీడియా ఎంతో సపోర్ట్‌గా నిలిచింది. మా టీమ్ సహకారం వల్లే ఇంత సక్సెస్ ఫుల్‌గా ముందుకెళుతున్నాం. మేం వంద శాతం ఒరిజినల్ కంటెంట్, షోలనే తీసుకు వచ్చాం. ఎన్నో ఐకానిక్ షోలను చేశాం. మేం వేసిన బాటలో ఎంతో మంది నడిచారు, నడుస్తున్నారు. మేం ఎన్నో ఒరిజినల్ ఐడియాస్‌ను క్రియేట్ చేశాం. ‘ఆరంభం ఒక్క అడుగు’తో అంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాం. ఓటీటీ సంస్థల్లో మేము స్టాండర్డ్స్‌ను సెట్ చేశాం. ‘గాలివాన, ఏటీఎం, పరువు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, పులి మేక’ ఇలా ప్రతీ చోటా మేం ఒరిజినల్ కంటెంట్‌తోనే వచ్చాం. ‘పులి మేక’ అనేదే ఫస్ట్ ఫీమేల్ కాప్ స్టోరీ. మా నుంచి ఆ స్టోరీ వచ్చిన తర్వాత ఎన్నో కాప్ స్టోరీలు వచ్చాయి. ఓటీటీల్లో ఎన్నో కాప్ స్టోరీలు వస్తున్నాయి. ఆ మధ్య ఓ కాప్ స్టోరీ కావాలని నేనే దివ్యను అడిగాను. అప్పుడే దివ్య సొంతంగా ఈ కథను రాసుకొచ్చారు. మేం ప్రజంట్ జరుగుతున్న వివాదం గురించి మాట్లాడడానికి రాలేదు. మా కంపెనీ పాలసీని దాటి మేము మాట్లాడదలుచుకోలేదు. ప్రజంట్ ఈ వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు మేం ఏమీ మాట్లాడకూడదు. ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా.. మా సిరీస్‌కు చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, హద్దుల్ని చెరిపేస్తూ వచ్చాం. ఇంకా ఇలాంటి పాత్ బ్రేకింగ్ కంటెంట్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తాం. సత్యమేవ జయతే. మాకు మా కాంపిటీటర్స్ పట్ల ఎంతో గౌరవం ఉంది. మా సంస్థను కించపర్చేలా మాట్లాడిన వారిపై పరువునష్టం దావా వేశాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. అసలు విషయం త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు.

Also Read- Ileana: రెండో బిడ్డకు జన్మినిచ్చిన ఇలియానా.. సెలబ్రిటీలు ఆపుకోలేకపోతున్నారు

కథా రచయిత్రి దివ్య తేజస్వీ మాట్లాడుతూ.. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు అనురాధ మేడమ్, దేశ్ రాజ్ సార్ మొదటి నుంచి వెన్నంటే నిలిచారు. జీ5 నాకు చాలా మంచి ఫ్లాట్ ఫాంను ఇచ్చింది. దయచేసి మా మీద లేనిపోని ఆరోపణలు చేయకండి. కాపీ రైట్ చట్టం మాకు కూడా తెలుసు. కొత్త పాయింట్ చెప్పాలనే ఆరాటం మాకూ ఉంటుంది. పోలీస్ కథలు కొన్ని వందలు, వేలు ఉంటాయి.. ఊర్లో జరిగే కథలు చాలా ఉంటాయి. ఓ వ్యక్తి తొందరపడి ఉండొచ్చు.. కానీ ఎంతో పేరున్న సంస్థ ఆలోచించి మాట్లాడితే బాగుండేది. మేం ఆ విషయంపై మాట్లాడాలని అనుకోవడం లేదు. మా విజయమే అన్నింటికీ సమాధానాలు చెబుతుంది. మా సిరీస్‌కు, వాళ్ల సిరీస్‌కు ఒక్క సీన్ కూడా కామన్‌గా ఉండదు. ఇలాంటి ఆరోపణలు నాపై వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. ఏదైనా సరే నేను చిరునవ్వుతోనే ఎదుర్కొంటానని తెలిపారు. ZEE5‌లో ప్రసారం అవుతున్న ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌లో సోషల్ మీడియా సెన్సేషన్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై KV శ్రీరామ్ నిర్మించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీ5 టీమ్‌తో పాటు, నిర్మాత శ్రీరామ్, నటీనటులు ప్రసంగించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్