Venu Swamy (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Venu Swamy: ఇద్దరు స్టార్ హీరోలు, ఒక స్టార్ హీరోయిన్ సూసైడ్ చేసుకుంటారు.. ఇంకా బుద్ధిరాలేదా!

Venu Swamy: వేణు స్వామి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు. ఈ మధ్య కాస్త తగ్గింది కానీ, ఇంతకు ముందు వేణు స్వామి చెప్పే జ్యోతిష్యంతో రోజూ వార్తలు వైరల్ అవుతూనే ఉండేవి. ‘నాగచైతన్య, శోభిత’ల పెళ్లిపై ఆయన మాట్లాడిన తీరుకు ఆయన గ్రహాలు కూడా గాడి తప్పాయి. ఫలితంగా కోర్టు, కేసులు అంటూ కొన్ని రోజుల పాటు చికాకులు అనుభవించాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆత్మహత్యేనాకు శరణ్యం అనే స్థాయికి వెళ్లాడు. కాదు కాదు, వెళ్లేలా చేశారు ఫిల్మ్ జర్నలిస్ట్‌లు. కోర్టులో ఏదోలా బయటపడ్డాడనుకుంటే.. మహిళా కమిషన్ ఊరుకుంటుందా? పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించింది.

Also Read- Karthi: కార్తీని చూసి నేర్చుకోండయ్యా.. టాలీవుడ్ హీరోలపై కౌంటర్స్

ఆ వార్నింగ్ తర్వాత తెలుగు వాళ్లకు సంబంధించి కానీ, తెలుగు సెలబ్రిటీల జ్యోతిష్యం కానీ ఇకపై చెప్పనని వేణు స్వామి బహిరంగంగా మాటిచ్చాడు. కానీ ఆ మాటపై నిలబడలేదు. మళ్లీ మొదలెట్టాడు. ఈ ఘటనలన్నీ జరిగిన తర్వాత జ్యోతిష్యం అయితే చెప్పనన్నాడు కానీ, టాలీవుడ్ త్వరలో నాశనం అయిపోతుందని శాపనార్థాలు మాత్రం పెట్టాడు. నన్ను ఇబ్బంది పెట్టిన టాలీవుడ్, దాని వెనుక ఉన్నవారంతా నాశనం అయిపోతారు. అతి త్వరలోనే అతి జరుగుతుంది. బ్యాచ్‌లు ఎక్కువైపోతాయి. ఒకరంటే ఒకరికి పడదు. తలలు బద్దలు కొట్టుకుంటారంటూ గట్టిగానే శపించాడు.

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అని మన పెద్దలు ఎప్పుడో అన్నారు. అలాంటిది వేణు స్వామి మాటలను పట్టించుకునేదెవరు? అని అంతా లైట్ తీసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు, ఒక స్టార్ హీరోయిన్ ఆత్మహత్య చేసుకుంటారంటూ మాట్లాడి, మరోసారి హాట్ టాపిక్‌గా నిలవడమే కాదు, ఇండస్ట్రీలో కలకలం రేపాడు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబెట్‌ లైవ్‌లో వేణు స్వామి ఓ జర్నలిస్ట్‌తో మాట్లాడుతున్నట్లుగా ఓ ఆడియోను ప్లే చేశారు.

ఇలాంటి వారిని ఏం చేయాలి? ఎందుకు వదిలేస్తున్నారు? అని చర్చ నడుస్తుందీ ప్రోగ్రామ్‌లో. ఆ స్టార్స్ పేరు కూడా వేణు స్వామి ఈ ఆడియోలో చెప్పడం విశేషం. ఆయన చెప్పిన స్టార్స్, స్టార్ హీరోయిన్ ఎవరంటే.. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత. అవును, ఇవే వేణు స్వామి చెప్పిన పేర్లు. అయితే ఆయన అన్నాడు కదా అని, ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత వంటి వారు రియాక్ట్ అవ్వాలా? అంటూ మరో సీనియర్ జర్నలిస్ట్ కూడా ఎదురు ప్రశ్నించాడు. ఆయన చెప్పిన పేర్లు భయపడిపోయి కోటాను కోట్లు ఇచ్చి, వేణు స్వామి దగ్గర శాంతి చేయించుకోవాలి.. అదే అతని ప్లాన్ అనేలా చర్చ జరుగుతుంది.

Also Read- Robinhood: ‘గ్రోక్’ చెప్పిందే జరిగింది.. ఫైనల్‌గా డేవిడ్ వార్నర్‌కు లింక్ పెట్టారుగా!

అయితే, అసలు వేణు స్వామికి ఇంత డేర్ ఏంటి? అంటూ ఆయన చెప్పిన స్టార్స్ ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంత జరిగినా కూడా వేణు స్వామిలో మార్పు, బుద్ధి రాలేదు. ఏం చేయాలి ఆయనని? అంటూ సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. నిజమే, ఎంత ధైర్యం ఉంటే అలా పబ్లిగ్గా పేర్లు రివీల్ చేస్తాడు? దీని వెనుక ఎటువంటి అజెండా లేదని ఎలా అనుకోవాలి? అంతేకాదు, ప్రభాస్ ఒంటినిండా గాయాలతో ఎవరికీ తెలియనీయకుండా బాధను అనుభవిస్తున్నాడని, అందుకే ఆయన సినిమాలు వాయిదా పడుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. మరి ఆయన వ్యాఖ్యలపై రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు