Venkatesh – Mahesh: తెలుగులో ప్రజంట్ రీ-రిలీజ్ ట్రెండ్ ఎంత జోరుగా కొనసాగుతుందో తెలియంది కాదు. ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిన మూవీస్ అన్నీ కూడా మరోసారి థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నారు. రీ-రిలీజ్‌లో మంచి స్పందన వస్తుండటంతో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. అప్పట్లో భారీగా కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు మరోసారి అదే జోరు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ క్లాసిక్ మూవీ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి థియేటర్స్‌లోకి వస్తుంది. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ప్రధాన పాత్రల్లో నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాను రీ-రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అప్పట్లో ఈ సినిమా ఫ్యామిలీస్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.
2013లో సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇద్దరు అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని డైరెక్టర్ ఎంతో గొప్పగా చూపించాడు. ఇద్దరు స్టార్ హీరోలు కూడా అద్భుతంగా నటించారు. సమంత, అంజలి.. ఇద్దరికీ ఈ సినిమాలో మంచి పాత్రలు దక్కాయి. ముఖ్యంగా వెంకటేష్‌కి మరదలుగా యాక్ట్ చేసిన అంజలి నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఇక కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు, జీవిత సత్యాలు, మనుషుల మధ్య సంబంధాలు వంటి అంశాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్స్‌లో సందడి చేసేందుకు వస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా రీ-రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మార్చి 7న గ్రాండ్‌గా ఈ మూవీని రీ-రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ‘సమయం ఆసన్నమైంది. సిద్ధంగా ఉండండి’ అని క్యాప్సన్ జోడించి మరీ రీ రిలీజ్ డేట్ పోస్టర్‌ని విడుదల చేశారు. దీంతో వెంకీ మామ, మహేష్ బాబు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. చాలా గ్యాప్ తర్వాత మరోసారి థియేటర్స్‌కు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో చూడాల్సి ఉంది.
The wait is over! 🎬✨
Relive the magic of family, love, and brotherhood with Peddhodu @VenkyMama & Chinnodu @urstrulyMahesh 🙌Catch the timeless classic #SeethammaVakitloSirimalleChettu in theatres on March 7th❤️🔥
Get Ready to experience the nostalgia once again🔥… pic.twitter.com/mYD1RZvvnI
— Sri Venkateswara Creations (@SVC_official) February 21, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు విషయానికి వస్తే.. దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. హిస్టరీలో నిలిచిపోయేలా జక్కన్న- మహేష్ బాబుల సినిమా ఉంటుందని అంటున్నారు. మహేష్ బాబుతో సరికొత్త కాన్సెప్ట్‌తో రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇక వెంకీమామ విషయానికి వస్తే.. ఈ సంక్రాంతికి వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా రికార్డులలోకి ఎక్కింది. రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టి ప్రేక్షకులను మెప్పించింది.