VT15 Update
ఎంటర్‌టైన్మెంట్

Varun Tej: వరుణ్ తేజ్ కొరియా వెళుతున్నాడు.. ఎందుకంటే?

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) కొరియో వెళుతున్నాడు. ఎందుకని అనుకుంటున్నారా? ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇండో-కొరియన్ హారర్ కామెడీగా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయనుంది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను ప్రస్తుతం ‘VT15’గా పిలుస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌కి మంచి హిట్ కావాలి. సోలో హీరోగా ఆయనకు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. మొదటి నుంచి వరుణ్ తేజ్ వెరైటీ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు కానీ, ఈ మధ్యకాలంలో ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన నుంచి వచ్చిన లాస్ట్ సినిమా అయితే ప్రేక్షకులను, అభిమానులను భారీగా డిజప్పాయింట్ చేసింది. దీంతో ఈ సినిమాపై వరుణ్ తేజ్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే..

Also Read- Spirit: వాళ్లు, వీళ్లు కాదు.. ‘స్పిరిట్’ హీరోయిన్ ఎవరో అఫీషియల్‌గా ప్రకటించేశారోచ్!

హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైన అనంతరం, ఈ సినిమా హైదరాబాద్, అనంతపూర్‌లో జరిగిన రెండు షెడ్యూల్స్ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అనంతపూర్‌లోని ప్రముఖ కియా గ్రౌండ్స్, అందమైన గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వరుణ్ తేజ్, రీతికా నాయక్‌లపై పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో అనంతపూర్ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని చిత్రయూనిట్ చెబుతోంది. సినిమా ఫస్ట్ హాఫ్‌లోని థ్రిల్లింగ్ సన్నివేశాలు, పంచ్ హ్యూమర్‌తో కూడిన సన్నివేశాలని ఈ షెడ్యూల్స్‌లో చిత్రీకరించారని చెప్పుకొచ్చారు. రీతికా నాయక్, సత్య, మిర్చి కిరణ్‌ తదితర నటీనటులు ప్రతీ సన్నివేశంలో కామెడీని పండించారని, రేపు థియేటర్లలో ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తారని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.

Also Read- Kiran Royal: పవన్ సినిమాపై కక్ష కడతారా.. మీకు జగనే కరెక్ట్.. కిరణ్ రాయల్ ఫైర్!

ఈ సినిమాకు సంబంధించిన విషయాలను వింటుంటే.. సినిమాపై ఎగ్జయిట్‌మెంట్‌తో పాటు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇంటర్నేషనల్ షెడ్యూల్‌ కోసం సిద్ధమవుతోంది. ఆ షెడ్యూల్ కొరియాలో జరుగుతుందని, ఈ పార్ట్ ద్వారా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండో-కొరియన్ హారర్-కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుందని టీమ్ చెబుతోంది. వరుణ్ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, సంగీతం సంచలనం ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఒక వైపు జరుపుతూనే, మరో వైపు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే నిజమైతే మాత్రం త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని భావించవచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు