October releases: అక్టోబర్ నెల మూవీ లవర్స్ కు పండగే అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు పది సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల నుంచి రొమాంటిక్ డ్రామాలు, మిథాలజికల్ యాక్షన్, కామెడీల వరకు వైవిధ్యమైన జానర్‌లు సినిమా అభిమానుల ముందుకు రానున్నాయ. అవి ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
Read also-Bigg Boss 9 Telugu Promo: తనూజ మూతిపై దాడి.. హోస్‌లో మళ్లీ రచ్చ రచ్చ.. ప్రోమో చూస్తే గూస్ బంప్సే!
1. ఇడ్లీ కొట్టు (తెలుగు డబ్) – అక్టోబర్ 1, 2025న ధనుష్ డైరెక్షన్‌లో యాక్షన్, డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది. ధనుష్, నిత్యా మేనన్, అరుణ్ విజయ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘U’ సర్టిఫికేట్ లభించింది, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
2. కాంతారా చాప్టర్ 1 (తెలుగు డబ్) – అక్టోబర్ 2, 2025రిషబ్ శెట్టి డైరెక్షన్‌లోని ఈ మిథాలజికల్ యాక్షన్ చిత్రం రానుంది. కాదుబెట్టు శివుడి మూలాలను కడంబ రాజవంశ కాలంలో చూపిస్తుంది. వన్యవాతావరణం, మర్చిపోయిన లోర్‌లతో ఆకట్టుకునే కథ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కానుంది. రిషబ్ శెట్టి దర్శకడిగానే కాకుండా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
3. శశివదనే – అక్టోబర్ 10, 2025న కోనసీమ అందాల్లో శశి, రాఘవల మధ్య ప్రేమ కథను చెప్పే రొమాంటిక్ డ్రామా. రక్షిత్ అట్లూరి, కొమలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమర గొప్పి ఫిల్మ్ కంపెనీ, ఎస్ వీ ఎస్ స్టూడియోస్ బ్యానర్‌లో రూపొందింది.
4. మిత్ర మండలి – అక్టోబర్ 16, 2025న రానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. విజయేందర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ కామెడీ చిత్రం, ఒక గ్రూప్ మిస్‌ఫిట్ ఫ్రెండ్స్ రాజకీయవేత్త కుమార్తెపై ఒకరు పడటంతో జరిగే కలకలం చుట్టూ తిరుగుతుంది. ప్రియదర్శి, నిహారికా ఎన్ ఎమ్, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన రాబడుతోంది.
5. LIK – లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (తెలుగు డబ్) – అక్టోబర్ 17, 2025న నయనతార భర్త విగ్నేష్ శివన్ డైరెక్షన్‌లో రూపొందిన సై-ఫై రొమాంటిక్ కామెడీ చిత్రం. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్ జే సూర్య, యోగి బాబు, నటిస్తున్నారు.
6. డ్యూడ్- ప్రదీప్ రంగనధన్ హీరోగా అక్టోబర్ 17, 2025న రాబోతున్న మరో సినిమా డ్యూడ్. మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను నర్మిస్తున్నారు.
Read also-People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఈ సారి భయపెట్టడానికి రెడీ..
7. తెలుసు కాదా – అక్టోబర్ 17, 2025న నీరజా కోనా డైరెక్షన్‌లోని న్యూ ఏజ్ లవ్ స్టోరీ జానర్ లో రాబోతున్న చిత్రం ఇది. సిద్ధు జోన్నలగడ్డ (వరుణ్), రాశీ ఖన్నా (అంజలి), శ్రీనిధి శెట్టి (రాగ) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది.
8. K-ర్యాంప్ – అక్టోబర్ 18, 2025న జైన్స్ నాని డైరెక్షన్‌లో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. హాస్యా మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.