Srivani: ఆ సమయంలో లక్షలు సంపాదించా..
srivani ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Srivani: కరోనా టైంలో లక్షలు సంపాదించానంటూ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సీరియల్ నటి

Srivani: సీరియల్స్ తనకు, భర్తకు వచ్చే సంపాదనతో కుటుంబ ఖర్చులు, మెయింటెనెన్స్, షూటింగ్‌లలో అవసరమయ్యే డ్రెస్సులు, ఆభరణాలు వంటి ఖర్చులు తీరుతాయని ఆమె చెప్పింది. తమ కుటుంబ సభ్యులందరి డబ్బులు చివరికి తన అకౌంట్‌లోకే వస్తాయని వెల్లడించింది.

యూట్యూబ్ ప్రయాణం గురించి మాట్లాడుతూ .. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పని లేకపోవడంతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించానని, మొదటి నెలలో కేవలం పది వేల రూపాయలు వచ్చినా, అనంతరం నెలన్నరలోనే ఆ ఛానెల్ నుండి 30 లక్షల రూపాయలు రావడం తనను ఆశ్చర్యపర్చిందని శ్రీవాణి అన్నారు.

సీరియల్స్‌లో వేల ఎపిసోడ్లు చేసినా అంత ఆదాయం రాలేకపోయినప్పటికీ, యూట్యూబ్ ఒకేసారి అంత డబ్బు వచ్చిందని చెప్పారు. అయితే, ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ల సంఖ్య పెరగడంతో, కొత్త కంటెంట్ వరుసగా రావడంతో ఆదాయం కొంత తగ్గిందని అంగీకరించారు.

విక్రమాదిత్య చూసుకునే బాధ్యతల గురించి మాట్లాడుతూ.. ఆయన తమ కుటుంబం యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని హ్యాండిల్ చేస్తారని , అంతే కాదు, అదనంగా ఒక సంస్థను స్థాపించి దాని కింద 35 యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారని వివరించారు.

ఈ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు వైరల్ కావడంతో.. “ అంటే సీరియల్ స్టార్స్ యూట్యూబ్ వీడియోలతో ఇంతలా సంపాదిస్తున్నారా?” “అందుకేనా ఈ మధ్య టీవీ నటీనటులందరూ యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారేమో!” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి