Tunnel Movie: యాక్షన్ థ్రిల్లర్ మూవీగా అథర్వా మురళీ (Atharvaa Murali) నటించిన ‘టన్నెల్’ చిత్రం (Tunnel Movie) సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అథర్వా మురళీ సరసన లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంటగా నటించిన ఈ చిత్రానికి రవీంద్ర మాధవ్ (Ravindra Madhav) దర్శకుడు. ఇప్పటికే తమిళ్‌లో విడుదలై గ్రాండ్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు లచ్చురామ్ ప్రొడక్షన్స్ అధినేత ఎ. రాజు నాయక్ అందిస్తున్నారు. ఈ మూవీని ఆయన ఎందుకు తెలుగులో రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. ‘టన్నెల్’ సినిమాకు సంబంధించి నిర్మాత ఎ. రాజు నాయక్ (A Raju Naik) చెప్పిన సంగతులివే..
Also Read- Shocking Incident: రూ.500 డిపాజిట్ చేసి.. రూ.5 కోట్లు డ్రా చేశాడు.. వీడు మామూలోడు కాదు భయ్యో!
ప్రత్యేకంగా చెన్నై వెళ్లి చూశా..
‘‘ఈ సినిమాను చెన్నైలో చూశాను. టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. కథ చాలా కొత్తగా ఉంది కదా.. అని ఇలాంటి సినిమాను తెలుగు వారికి అందించాలని నిర్ణయించుకున్నాను. అందుకే చెన్నైకి వెళ్లి ప్రత్యేకంగా సినిమా చూశా. నాకు విపరీతంగా నచ్చేసింది. వెంటనే తెలుగులో విడుదల చేయాలని ఫిక్సయ్యాను. ఈ మూవీ కథ చాలా కొత్తగా ఉంటుంది. కథ అంతా కూడా ఒక్క రాత్రిలోనే జరుగుతూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పోలీసుల్ని హీరో ఎలా కాపాడాడు? సైకోని ఎలా పట్టుకున్నాడు? టన్నెల్‌కు, ఈ కథకు ఉన్న సంబంధం ఏంటి? అనే కథాంశంతో ఈ మూవీని దర్శకుడు చాలా ఆసక్తికరంగా మలిచాడు. సీటు ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది.
Also Read- Deepika Padukone: వరుసగా రెండో షాక్.. కల్కి 2 నుంచి దీపిక పదుకొనే ఔట్..
ఏ ఒక్కరినీ నిరాశ పరచదు
తెలుగులో విడుదల చేయాలని అనుకున్న తర్వాత విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. తమిళ్‌లో ఈ సినిమా చాలా బాగా ఆడింది. తెలుగులోనూ ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, ఇలాంటి వైవిధ్యభరిత చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను. మా బ్యానర్‌లో ఇంతకుముందు ‘దమ్మున్నోడు, స్వేచ్ఛ’ అనే చిత్రాలు నిర్మించాను. త్వరలోనే ‘శ్రీ గాంధారి’ అనే మూవీని ప్రేక్షకులకు అందించబోతున్నాం. ఇవి కాకుండా ఇంకొన్ని చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం మా ఫోకస్ అంతా కూడా ఈ ‘టన్నెల్’ పైనే ఉంది. ఈ మూవీ రిలీజై పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడటానికి వచ్చిన ఏ ఒక్కరినీ ‘టన్నెల్’ నిరాశ పరచదు. యాక్షన్, లవ్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల అంశాలు ఇందులో ఉన్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుందని ఆశిస్తున్నాను’’ అని నిర్మాత ఎ. రాజు నాయక్ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు