TSR Movie Makers: టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతోన్న ప్రొడక్షన్ నెంబర్ 3 చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తుండగా, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. హరికృష్ణ హీరోగా, భవ్య శ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రేమ, త్యాగం, మరియు కుటుంబ విలువల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతుందని, హరికృష్ణ, భవ్య శ్రీల మధ్య సహజమైన కెమిస్ట్రీ, కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా చూపిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Also Read- King Nagarjuna: నాగ్ సార్.. మీరు తయారు చేసిన ఉగ్రవాదులు వీరే.. రివీల్ చేసిన నా అన్వేష్!
ఈ చిత్ర మొదటి షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించినట్లుగా తెలుపుతూ మేకర్స్ కొన్ని ఫొటోలను విడుదల చేశారు. ఈ ఫొటోలలో టీమ్ అంతా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తుండగా, గౌతమ్ రవిరామ్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కందుకూరి సంభాషణలు పాత్రల భావాలను సహజంగా ఆవిష్కరించేలా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా కేవలం ప్రేమకథ మాత్రమే కాదని, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను తెలిపే ఎమోషన్స్‌తో హృదయానికి హత్తుకునేలా దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి కథ, కథనాలను సిద్ధం చేశారని అంటున్నారు.
ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ.. టిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమా ప్రేమికులకు మరో విజయవంతమైన చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకు ముందు ఈ బ్యానర్‌లో వచ్చిన ‘తికమక తాండ’, ‘కోబలి’ వంటి వైవిధ్యమైన సినిమాలు ఈ సంస్థకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడీ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటున్న మూడో సినిమాకు నేను డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పగలను. గతంలో ఎన్నడూ చూడని ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించనున్నాం. ఈ బ్యానర్ ప్రతిష్టని పెంచే సినిమాగా మా సినిమా ఉంటుందని మాట ఇస్తున్నాను. సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలని తెలిపారు.
Also Read- Game Changer: కర్ణుడి చావుకి కారణాలు అనేకం.. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్‌కి కూడా అంతే!
నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ సినిమా కంటెంట్ నాకు ఎంతగానో నచ్చింది. కొత్త జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను సహజమైన లొకేషన్స్‌లో, గ్రాండ్‌గా చిత్రీకరించనున్నాం. ఆడియన్స్‌కి ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చే చిత్రంగా, ఈ సినిమా నిలుస్తుందని భావిస్తున్నాను. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాం. దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి పక్కా ప్లానింగ్‌లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నటీనటుల, సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ సినిమాను గొప్పగా రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు