Tollywood Dominance: ఒకప్పుడు ప్రాంతీయ సినిమాగా ముద్రపడిన టాలీవుడ్, నేడు గ్లోబల్ సినిమాగా రూపాంతరం చెందింది. భారతీయ చలనచిత్ర పరిశ్రమ అనగానే కేవలం బాలీవుడ్ మాత్రమే గుర్తొచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ లెక్కలను శాసిస్తోంది మన తెలుగు సినిమా. భారతీయ సినీ చరిత్రలో రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాలను గమనిస్తే, మన టాలీవుడ్ సత్తా ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1 000 కోట్ల మార్కును దాటిన సినిమాలు కేవలం తొమ్మిది మాత్రమే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ అరుదైన మైలురాయిని చేరుకున్న హీరోలలో టాలీవుడ్ నుండి నలుగురు అగ్ర కథానాయకులు ఉండటం విశేషం.
Read also-Nandini Suicide: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సీరియల్ నటి నందిని.. ఎందుకంటే?
ప్రభాస్ (డబుల్ ధమాకా): పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి 2’, నాగ్ అశ్విన్ అద్భుతం ‘కల్కి 2898 AD’ చిత్రాలతో ప్రభాస్ రెండుసార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరి తన గ్లోబల్ మార్కెట్ స్టామినాను నిరూపించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, హిందీ బెల్ట్‌లో కూడా రికార్డులు తిరగరాస్తూ ₹1000 కోట్ల క్లబ్‌లో సగర్వంగా నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘RRR’ చిత్రంతో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ సినిమా కేవలం వసూళ్లలోనే కాకుండా, ఆస్కార్ వేదికపై కూడా మెరిసి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది.
Read also-ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!
బాలీవుడ్‌ను వెనక్కి నెట్టి..
ఒకప్పుడు భారతీయ సినిమాకు చిరునామాగా ఉన్న బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ వేగాన్ని అందుకోవడానికి తడబడుతోంది. రూ.1000 కోట్ల క్లబ్‌లో బాలీవుడ్ నుంచి కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే ఉన్నారు. అమీర్ ఖాన్ (దంగల్), షారుఖ్ ఖాన్ (పఠాన్, జవాన్), రణవీర్ సింగ్ (తాజా చిత్రం ‘ధురంధర్’తో ఈ జాబితాలో చేరారు) బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఇప్పుడు టాలీవుడ్ దర్శకుల వైపు, మన మేకింగ్ స్టైల్ వైపు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తెలుగు దర్శకుల మేధస్సు, నిర్మాణ విలువల స్థాయి పెరగడం మరియు మన హీరోల మాస్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే భాషా బేధాలు లేకుండా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని టాలీవుడ్ నిరూపించింది. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ బడ్జెట్ చిత్రాలతో టాలీవుడ్ మార్కెట్ మరింత విస్తరించడం ఖాయం.

