Tollywood: ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) విడుదల చేసిన లేఖలో రిటర్న్ గిఫ్ట్ అదిరింది అంటూ టాలీవుడ్ పెద్దలని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ లేఖ వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో ఒకరి తర్వాత ఒకరు మీడియా సమావేశాలు నిర్వహించి.. పవన్ కళ్యాణ్ చెప్పేదానిలో వాస్తవముందని ఒప్పుకున్నారు. ఇక థియేటర్ల బంద్ అంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ చేసిన హడావుడి అయితే.. అసలు పీక్స్ అనే చెప్పాలి. సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా వస్తుందనుకునే సయయం చూసి.. థియేటర్ల బంద్ అంటూ వాళ్లు షో చేశారు. దానికి ఇండస్ట్రీలోని కొందరి నిర్మాతలు కూడా సపోర్ట్ చేసినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అలా రియాక్ట్ అవుతారని వాళ్లు ఊహించలేదు.. ఒక్క లెటర్‌తో వాళ్ల ప్లాన్స్‌ని, కుట్రలని పటాపంచల్ చేశారు.
Also Read- SKN: నాన్న అరటిపళ్లు అమ్మిన చోట.. కొడుకు కటౌట్.. ఇంతకంటే ఏం కావాలి?
పవన్ కళ్యాణ్ లేఖతో ఇండస్ట్రీలో చర్చలు ఓ రేంజ్‌లో నడిచాయి. ఎట్టకేలకు అందరూ ఒకతాటి మీదకు వచ్చి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమక్షంలో ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అలా అనుకుని, ఆదివారం (జూన్ 15)న సీఎం చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ మీటింగ్‌కు రావాల్సిన వారందరినీ ఫోన్ చేసి మరీ ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చాయి. దాదాపు 50 ప్లస్ మెంబర్స్ ఇండస్ట్రీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుని కలిసేందుకు వెళుతున్నట్లుగా టాక్ కూడా బయటికి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటారని వార్తలు వచ్చినా.. అసలు ఈ మీటింగ్ ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. ఆదివారం అందరూ వెళ్లారా? వెళితే ఎక్కడా వార్త కూడా రాలేదు కదా.. అని ఎంక్వైరీ చేస్తే.. మీటింగ్ క్యాన్సిల్ అయినట్లుగా సమాచారం అందుతోంది.
Also Read- Rajinikanth: ‘కన్నప్ప’ చూసిన పాపారాయుడు.. మంచు హీరోల స్పందనిదే!
సినీ పెద్దలంతా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని సూచనలు చేయాలని చూశారు. కానీ అనూహ్యంగా ఈ మీటింగ్ రద్దు అయిందనేది తాజా సమాచారం. కారణం ఏంటంటే, ఈ మీటింగ్‌కు ఇండస్ట్రీ నుంచి వెళ్లాల్సిన వారిలో కొందరు అందుబాటులో లేకపోవడంతో.. మరోరోజుకు వాయిదా వేశారని తెలుస్తుంది. ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి, నాగ్ అశ్విన్, అశ్వినీ దత్ అల్లు అరవింద్, దిల్ రాజు, దానయ్య, బాలయ్య, ఆర్ నారాయణ మూర్తి, నాని.. వంటి వారెందరో ఈ మీటింగ్‌కు హాజరు కావాల్సి ఉంది. ఈ లిస్ట్‌లోని కొందరు షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశాలలో ఉండిపోవడంతో.. అందరూ వచ్చిన తర్వాత వచ్చి కలుస్తామని.. టాలీవుడ్ పెద్దలు ఏపీ ప్రభుత్వానికి సమాచారమిచ్చారట. అది విషయం. ప్రభుత్వం తరపున పిలిచి మరీ సమస్యలు తీరుస్తామంటే.. వీళ్లు షూటింగ్.. అది, ఇది అని వాయిదా వేయడం ఏంటో వారికే తెలియాలి.
మరో వైపు అంతకు ఒక్క రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ (Gaddar Film Awards)లో సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడిన మాటలు, ఇండస్ట్రీ పెద్దల్ని ఆలోచనల్లో పడేశాయనేలా కూడా టాక్ వినబడుతోంది. మరోవైపు ఈ అవార్డ్స్ తీసుకోవడానికే చాలా మంది సెలబ్రిటీలు రాలేదు. ఇక మీటింగ్స్ అంటే వస్తారా? అనేలా కూడా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు