Kiran Abbavaram (Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Kiran Abbavaram: మొదటిసారి కొడుకు ఫేస్ రివీల్ చేసిన కిరణ్ అబ్బవరం.. పేరేంటో తెలుసా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యంగ్ హీరో రచయిత, నిర్మాత. తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood) లో పనిచేస్తున్నాడు. ఆయన యువ హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా రొమాంటిక్, యాక్షన్ చిత్రాలలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. కిరణ్ తన సినిమాలలో సహజమైన నటన, డైలాగ్ డెలివరీ, ఆకర్షణీయమైన లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కిరణ్ అబ్బవరం తన సినీ కెరీర్ ను 2019లో “రాజా వారు రాణి గారు” మూవీతో ప్రారంభించాడు. ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా రూపొందింది. ఇందులో అతని నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

Also Read: Anasuya Bharadwaj: నా భర్త ఆ విషయంలో పర్ఫెక్ట్ కాదు.. హీరోలతో రొమాన్స్ చేస్తా.. అనసూయ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రహస్య ( Rahasya )దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. తాజాగా, వారి కుమారుడుతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తమ కుమారుడి నామకరణం కోసం తిరుమలకు వచ్చినట్లు కిరణ్ తెలిపారు. అయితే, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.

Also Read:  Nitin Gadkari: కేంద్రమంత్రి నివాసంలో బాంబు పెట్టా.. 10 నిమిషాల్లో పేలుతుందంటూ ఫోన్‌కాల్..

మొదటిసారి తన కుమారుడితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని కిరణ్ అబ్బవరం సంతోషం వ్యక్తం చేశారు. ఎక్స్ లో ఫోటోలు షేర్ చేస్తూ కొడుకు పేరు ‘హను అబ్బవరం’ ( Hanu Abbavaram) అని పేరు పెట్టామని, దర్శనం అద్భుతంగా జరిగిందని పోస్ట్ లో రాసుకొచ్చారు.

Also Read: Sai Rajesh: ‘బేబి’కి నేషనల్ అవార్డ్స్.. నన్ను ఎవరూ నమ్మని రోజు ఆయన నమ్మాడంటూ డైరెక్టర్ ఎమోషనల్!

అంతేకాదు, తాను నటిస్తున్న సినిమాల గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రస్తుతం ‘కే ర్యాంప్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, ఈ నెలలో మరో కొత్త చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కానుందని వెల్లడించారు. కిరణ్ యూ ఆర్ ఎస్ (యూనిక్, రొమాంటిక్, స్టార్) వైబ్‌తో, కెరీర్‌లో ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!