Prudhvi | థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆస్పత్రిలో చేరారు. ఆయన హై బీపీతో ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు. పృథ్వీ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన గొర్రెల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దెబ్బకు బాయ్ కాట్ లైలా అంటూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ క్షమాపణలు కూడా చెప్పాడు. అయినా సరే వివాదం మాత్రం సద్దుమణగలేదు. తన వ్యాఖ్యలపై పృథ్వీ(Prudhvi) మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చేరారు.
