War 2 Official Trailer: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్న ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించనుండటంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. వరల్డ్ వైడ్ గా ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ రివ్యూ
ట్రైలర్ ఓపెన్ చేయగానే హృతిక్ రోషన్ ” నేను ప్రమాణం చేస్తున్నాను.. నేను నా పేరును, నా గుర్తింపును, నా ఇంటిని , నా కుటుంబాన్ని అన్ని వదిలేసి ఒక నీడ లాగా మారిపోతాను. ఒక ఊరు, పేరు లేని రూపం లేని నీడ లాగా.. ” అని ఎమోషల్ టచ్ ఇస్తూ .. ఆడియెన్స్ మదిని దోచేశాడు. ” నేను మాటిస్తున్నాను .. ఎవ్వరూ చేయలేని పనులను నేను చేసి చూపిస్తాను. ఎవరూ పోరాడలేని యుద్దాన్ని నేను పోరాడతాను ” అని ఎన్టీఆర్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అందర్ని ఆకట్టుకుంటుంది. ” మిత్రులైన సరే ఆప్తులైన సరే పట్టించుకోను.. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనుకడుకు వేయకుండా వెళ్ళి పోతాను ” అనే హార్ట్ కి టచ్ అయ్యే డైలాగ్ తో హృతిక్ కట్టి పడేశాడు.
నెటిజన్ల రియాక్షన్ ఇదే
ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది ఆల్ ది బెస్ట్ ఎన్టీఆర్ అన్న జై ఎన్టీఆర్. టైలర్ సూపర్ ఇరగదీసాడు మా అన్న.. ఎన్టీఆర్ లవ్ యు అన్నయ్య. ఇది కదా మాకు కావాల్సింది జై NTR అన్నా అంటూ కామెంట్ల వర్షం కురుస్తుంది. ఇంకొందరు ఎక్స్ట్రాడినరీ ట్రైలర్ సూపర్ మైండ్ బ్లోయింగ్. ఊర మాస్ ట్రైలర్ అంటూ కామెంట్స్ చేస్తూన్నారు.