The RajaSaab: ‘ది రాజాసాబ్’ రాబట్టిన డే 1 కలెక్షన్స్ ఎంతంటే?..
the-rajasab-collections
ఎంటర్‌టైన్‌మెంట్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ రాబట్టిన డే 1 కలెక్షన్స్ ఎంతంటే?.. రెబల్ రేంజ్ దాటిందా?

The RajaSaab: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో విడుదలైన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజే సుమారు రూ.54.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో ఇండియాలో వచ్చిన వసూళ్లు దాదాపు రూ.45 కోట్లు. పెయిడ్ ప్రివ్యూ షోల ద్వారానే ఈ చిత్రం రూ.9.15 కోట్లు సాధించింది. పెయిడ్ ప్రివ్యూలు మొదటి రోజు కలెక్షన్లు కలిపి మొత్తం రూ.54.15 కోట్లు వసూలు చేసింది. ఇది ప్రభాస్ గత సినిమాలు అయిన సలార్, కల్కీ సినిమాలతో పోలిస్తే చలా తక్కువ. అంతే కాకుండా 2022లో విడుదలైన రాధేశ్యామ్ సినిమా మొదటి రోజు కలెక్షన్లతో సమానంగా ఈ సినిమా ఈ సినిమా కూడా వసూలు చేసింది. అంటే ప్రభాస్ గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమా దాదాపు మూడు రెట్లు తక్కువ. అయితే రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

Read also-BMW Heroines: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. హీరోయిన్లు యమా హుషారుగా ఉన్నారుగా!

ఆక్యుపెన్సీ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ఇక్కడ థియేటర్లలో సగటున 57.16% ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా నైట్ షోలకు ఆక్యుపెన్సీ 69.20% వరకు పెరగడం విశేషం. హిందీ వెర్షన్ సుమారు 15.63%, తమిళ వెర్షన్ 22.61% ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమా రికార్డులను అధిగమిస్తూ, 2026 సంవత్సరంలో అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్-కామెడీ చిత్రంలో ప్రభాస్ తన పాత ‘వింటేజ్’ లుక్ కామెడీ టైమింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.

Read also-Pawan Kalyan: హైపర్ ఆదిని సత్కరించిన పవన్ కళ్యాణ్.. విషయం ఏంటంటే?

లాంగ్ రన్‌లో..

సినిమాకు ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రభాస్ స్టార్ పవర్ వల్ల వారాంతంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్రాంతి సీజన్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లు వచ్చినప్పటికీ ప్రభాస్ స్టార్ డమ్ కి ఇంకా మంచి కలెక్షన్లు వచ్చి వుండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్లు వసూలు చేస్తుందో చూడాలి మరి.

Just In

01

Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?

Super Star Krishna: మనవడు జయకృష్ణ ఆవిష్కరించిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం.. ఎక్కడంటే?

Vijay Deverakonda: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను.. చిరు సినిమాకైనా గుర్తించినందుకు హ్యాపీ!

Suspicious Death: కుళ్లిన స్థితిలో మృతదేహం.. అటవీ ప్రాంతంలో షాకింగ్ ఘటన

Travel Advice: సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా!.. పోలీసులు చెప్పిన ఈ సూచనలు పాటించారా లేదా మరి?