Chhaava
ఎంటర్‌టైన్మెంట్

Chhaava: చావా ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!.. ఆసక్తి చూపని తెలుగు ప్రేక్షకులు…?

Chhaava: ఛత్రపతి శంభాజీ మహారాజ్ ధైర్య సాహసాలను చాటిన సినిమాటిక్ మాస్టర్ పీస్ ‘ఛావా’. బాలీవుడ్‌లో ఇటీవలే రిలీజై భారీ విజయం సాధించింది. ఈ మూవీ కలెక్షన్స్ వర్షం కురిపించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించిన ‘ఛావా’లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రను ట్యాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ అద్భుతంగా పోషించారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఇక వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం వసూళ్లలో రూ. 700 కోట్లకు చేరువలో ఉంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక ఛావా తెలుగు వెర్షన్ 550+ స్క్రీన్లలో గ్రాండ్‌గా శుక్రవారం విడుదల అయ్యింది. హిందీలో ఈ మూవీ సృష్టిస్తున్న ప్రభంజనాన్ని చూసి, టాలీవుడ్ ప్రేక్షుకులు తెలుగు వెర్షన్‌లో రిలీజ్ చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్, గీత ఆర్ట్స్ బ్యానర్ పేరు మీద తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి నిన్న రీలీజ్ చేశారు. బాలీవుడ్‌లో విడుదలైన 3 వారాల తర్వాత తెలుగులో రిలీజైంది.

అయితే తెలుగులో తొలి రోజు ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఫిబ్రవరి 14న హిందీలో రిలీజైన ఈ చిత్రం తొలిరోజే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్‌ని సంపాదించుకుంది. టాలీవుడ్‌లో కూడా ఈ చిత్రానికి హిట్‌ టాక్‌ వచ్చింది. విక్కీ కౌశల్‌ నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాని ఫలితంగానే తెలుగులో రిలీజ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి ఫస్ట్ డే రూ.3.03 కోట్ల రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఓ డబ్బింగ్‌ చిత్రానికి ఫస్ట్‌డే ఈ స్థాయి వసూళ్లు రావడం రికార్డే అని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో వీకెండ్‌లో మరింత కలెక్షన్స్‌ పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. బుక్ మై షో యాప్ లో ఈ మూవీకి గంటకు 4000కు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయినట్టు తెలుస్తుంది.

మరోవైపు తెలుగు ట్రైలర్ రిలీజైన సమయంలో ఈ మూవీపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు డబ్బింగ్ అంతగా లేదని ఆడియన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తెలుగు కంటే హిందీయే బెటర్ గా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే విడుదలకు ముందు ఈ మూవీపై భారీ హోప్స్ ఉన్నాయి. కలెక్టన్స్ మోత మోగిస్తుందని ప్రేక్షకులు ఊహించారు. సాధారణంగా డబ్బింగ్ సినిమాలు రూ. 3 కోట్లు రాబట్టడం సాధారణమే. అయితే హైప్ కు తగ్గట్టు కలెక్షన్స్ రాలేదని మరికొందరు అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో శంభాజీ పాత్రలో విక్కీ నటించగా.. ఆయన భార్య ఏసుబాయి రోల్ లో రష్మిక యాక్ట్ చేసింది. ఇక ఔరంగాజేబు పాత్రలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అక్షయ్‌ ఖన్నా నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దాదాపు రూ.130 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందించారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్