Thaman S: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులకు ‘ఓజీ’ చిత్రం (OG Movie) ఫుల్ మీల్స్ ఇచ్చేసింది. ‘ఫుల్ మీల్స్’ అనే కాదు, బిర్యానీ, పులావ్.. ఇంకా ఎన్ని ఉంటే అన్ని ఇచ్చేసింది. అసలు ఈ సినిమా టైటిల్ రివీలైనప్పటి నుంచి.. అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్య వచ్చిన టీజర్, సాంగ్స్ అన్నీ కూడా ఈ సినిమా కోసం వేచి చూసేలా చేశాయి. ఆ ఎదురు చూపులకు సరిపడా ట్రీట్‌ని దర్శకుడు సుజీత్ ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు ఇచ్చేశారు. అవును, సినిమా చూసిన అభిమానులైతే ఎగిరి గంతేసి, చొక్కాలు చించేసుకుంటున్నారు. ప్రసాద్స్ మల్టీఫ్లెక్స్ వంటి సంస్థ.. ఇంకో టీ షర్టు తెచ్చుకోండి అని అధికారిక ప్రకటన విడుదల చేసిందంటే.. ఫ్యాన్స్ ఏ రేంజ్‌లో ఈ సినిమా థియేటర్లలో ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా ఎండింగ్‌లో ఇచ్చిన లీడ్‌ని బట్టి.. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఈ సీక్వెల్‌పై ఫ్యాన్స్.. దర్శకుడు సుజీత్ (Sujeeth), సంగీత దర్శకుడు థమన్ (Thaman S)కు రిక్వెస్ట్‌ల మీద రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.
Also Read- Tollywood: టాలీవుడ్ పెద్దరికం.. బాలయ్య జీర్ణించుకోలేకపోతున్నారా?
సీక్వెల్, ప్రీక్వెల్ ఒకేసారి..
తాజాగా దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు థమన్.. మీడియాకు ‘ఓజీ’ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలలో ‘ఓజీ 2’ ప్రశ్నలు ఎదురుకాగా, ఇద్దరూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ముందుగా దర్శకుడు సుజీత్.. ఈ సినిమాకు సీక్వెల్ మాత్రమే కాదు, ప్రీక్వెల్ కూడా ఉంటుందని వివరణ ఇచ్చారు. అంతేకాదు.. సీక్వెల్, ప్రీక్వెల్ ఒకేసారి తెరకెక్కిస్తామని, అందుకు సంబంధించిన కథలు కూడా సిద్ధమవుతున్నాయని అన్నారు. అయితే అవి ఎప్పుడు మొదలవుతాయనేది ఇప్పుడప్పుడే చెప్పలేమని తెలిపారు. మరోవైపు థమన్ ‘ఓజీ 2’పై రియాక్ట్ అయిన తీరు మాత్రం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. ‘ఓజీ’ సినిమా కోసం థమన్ ప్రాణం పెట్టేసిన విషయం తెలిసిందే. సినిమా చూసిన వారంతా, థమన్‌పై ప్రశంస వర్షం కురిపిస్తున్నారు. ఆయనను కొణిదెల థమన్ అంటూ సరదాగా సంభోదిస్తుండటం విశేషం.
Also Read- Puri Jagannadh: తమిళనాడులో తొక్కిసలాట.. డైరెక్టర్ పూరి జగన్నాధ్ సంచలన నిర్ణయం
‘ఓజీ’ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది
ఇక థమన్ ‘ఓజీ2’ గురించి మాట్లాడుతూ.. ‘ఓజీ 2’ కచ్చితంగా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ‘ఓజీ’ అనేది లైఫ్ టైమ్ ఉంటుంది. ఇంకా చాలా పార్ట్స్ వస్తాయి. సుజీత్ దీనిని వదిలిపెట్టడు. ‘ఓజీ’ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. అలాగే పవర్ స్టార్ కూడా దీనిని కంటిన్యూ చేయడానికి ఎంతగానో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారని థమన్ చెప్పుకొచ్చారు. థమన్ ‘ఓజీ2’కు సంబంధించి చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ఓజీ’ విషయానికి వస్తే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా నిర్మించారు. పవన్ కళ్యాన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి వారు ఇతర కీలక పాత్రలను పోషించారు.
The John Wick from Telugu 💥💥💥
In interview, Thaman also mentioned that Kalyan is also really interested to do part 2
Kalyan Japan raledu kabati go all out in building huge sets @Sujeethsign #TheyCallHimOG #OG #OG2 pic.twitter.com/IKMCIUYBya
— Sharat Chandra (@Sharatsays2) September 28, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు