Mirai: తేజ సజ్జా దెబ్బకు స్టార్ హీరోలు పక్కకు తప్పుకోవాల్సిందేనా?
Mirai Teaser ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Mirai Teaser: తేజ సజ్జా ‘మిరాయ్’ టీజ‌ర్‌ రిలీజ్.. ఈ కుర్రాడు దెబ్బకు స్టార్ హీరోలు పక్కకు తప్పుకోవాల్సిందేనా?

 Mirai Teaser:  ‘హను-మాన్’ చిత్రంతో యంగ్ హీరో తేజ స‌జ్జా ఎంత పెద్ద హిట్ కొట్టాడో మనందరికీ తెలిసిందే. ఈ ఒక్క మూవీతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో తేజ స‌జ్జా. ఈ మూవీ రిలీజ్ సమయంలో మహేష్ బాబు గుంటూరు కారం, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీని కూడా దాటేసి వందల కోట్లు కలెక్ట్ చేసి రికార్డు బ్రేక్ చేసింది . అయితే, ఇప్పుడు అదే ఫామ్ ను కొనసాగిస్తూ కొత్త చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు.

Also Read: Telangana Formation Day: కేటీఆర్ కీలక ప్రకటన.. సిద్ధంగా ఉండాలని క్యాడర్‌కు పిలుపు.. ఎందుకంటే?

ఈ యంగ్ హీరో న‌టిస్తున్న తాజా చిత్రం మిరాయ్‌. ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. అంతే కాదు, ఈ సినిమాలో సూపర్ యోధా గా తేజ కనిపించబోతున్నాడు. రితీకా నాయ‌క్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో మంచు మ‌నోజ్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్ట‌ర్లు, స్పెష‌ల్ గ్లింప్స్‌లు చిత్రం పై అంచ‌నాల‌ను భారీగా పెంచాయి. తాజాగా, చిత్ర బృందం టీజ‌ర్‌ను రిలీజ్ చేసింది.

Also Read: Baahubali song: పచ్చ బొట్టేసిన సాంగ్ ను రీక్రియేట్ చేసిన కుర్రాళ్ళు.. తమన్నాను దించేశారుగా..!

 ‘మిరాయ్’ టీజ‌ర్‌ రిలీజ్ ఎలా ఉందంటే? 

” జ‌ర‌బోయేది మార‌ణ‌హోమం.. శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం.. క‌లియుగంలో పుట్టిన ఏ శ‌క్తి దీన్ని ఆప‌లేదు అని జ‌య‌రాం చెప్పిన డైలాగ్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. మంచు మ‌నోజ్ విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. తేజ స‌జ్జా తన నటనతో అందర్ని మెప్పించడనే చెప్పుకోవాలి. మొత్తంగా టీజ‌ర్ చూస్తుంటే మనోడు ఈ సారి కూడా పెద్ద హిట్ కొట్టేలా ఉన్నాడు. వరల్డ్ వైడ్ గా సెప్టెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు ఈ చిత్రం రానుంది. ఇంకా ఈ మూవీలో శ్రియ‌, జ‌గ‌ప‌తి బాబు, జ‌య‌రాం వంటి చాలా మంది స్టార్లు ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..