Tamannaah
ఎంటర్‌టైన్మెంట్

Tamannaah: బ్రేకప్‌కి కారణం ఏమిటో చెప్పేసిన తమన్నా!

Tamannaah: స్టార్ నటి తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మకు విడిపోయినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట బ్రేకప్ అవ్వడంపై రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచనే లేదని చెప్పి షాకిచ్చిన సంగతి తెలిసిందే. వీరు సడెన్‌గా బ్రేకప్ చెప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

బాలీవుడ్‌లో ‘లవ్ స్టోరీ 2’ అనే వెబ్ సిరీస్‌లో విజయవర్మ, తమన్నా కలిసి యాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో ఇద్దరు కొంతకాలం డేటింగ్‌లో ఉన్నారు. చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతూ మీడియా కంట పడ్డారు. దీంతో ఈ కపుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే మొదట్లో తాము ఫ్రెండ్స్ అని, తమ మధ్య ఎలాంటి రిలషన్ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత విజయ్ వర్మ ఫ్యామిలీ ఫంక్షన్‌కు తమన్నా అటెండ్ అయ్యింది. దీంతో మరోసారి మిల్క్ బ్యూటీకి రిలేషన్‌షిప్‌పై ప్రశ్న ఎదురైంది. ఇక తాము ఇద్దరం ప్రేమించి కుంటున్నామని తెలిపారు. త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నామని చెప్పింది.

ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో తమన్నా పాల్గొని ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని వెల్లడించింది. విజయ్ వర్మతో తమన్నా పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరూ భావిస్తున్న సమయంలోనే ఇలా వ్యాఖ్యలు చేసి షాకిచ్చింది. ఇక ఆ తర్వాత నుంచి ఈ కపుల్ బ్రేకప్ వార్తలు హల్‌చల్ అయ్యాయి. అయితే ఇద్దరు ప్రేమికులుగా విడిపోయిన స్నేహితులుగా ఉండాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రేమ, రిలేషన్‌షిప్‌ అనే విషయాల్లో అయోమయానికి గురువుతున్నామని తెలిపింది. ఇద్దరి వ్యక్తుల మధ్య ఎప్పుడైతే కండీషన్స్ స్టార్ట్ అవుతాయో.. అక్కడ లవ్ అనేది ఉండదని నమ్ముతానని తెలిపింది. ఎందుకంటే లవ్‌కి స్వార్ధం ఉండదని వెల్లడించింది. నిజమైన ప్రేమ అయితే స్వార్ధం ఉండదని స్పష్టం చేసింది. స్వార్ధం ఉంటే అది వన్ సైడ్ లవ్ అని వివరించింది. ఎప్పుడైనా తాను ఎవరైనా ప్రేమిస్తే.. వారి ఫీలింగ్స్‌కి ఫ్రీడమ్ ఇవ్వాలని, వారు ఎలాగైతే ఉండాలని అనుకుంటారో అలాగే ఉండనివ్వాలని తెలిపింది. రిలేషన్‌లో ఉన్నప్పుడు కంటే లేనప్పుడే ఎంతో హ్యాపీగా ఉన్నానని అనిపిస్తుందని వివరించింది. ఒకరితో కలిసి జీవితం మంచి విషయం అని, అయితే ఆ భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ తెలిపింది. బ్రేకప్ వేళ తమన్నా వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Also Read: నేను రీ రిలీజ్ చేస్తా.. బ్లాక్‌బస్టర్ చేస్తారా?

ఇక మిల్క్ బ్యూటీ తమన్నా మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులో టాప్ హీరోలు అందరితో మిల్క్ బ్యూటీ కలిసి నటించింది. తనదైన నటన, అందంతో ఈ భామ మంచి క్రేజ్ సంపాదిచుకుంది. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ అనే మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆ తరువాత ‘హ్యాపీ డేస్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల ఆఫర్లు కొట్టేసింది. వరుసగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ చేస్తూ.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?