Supritha Naidu: సురేఖావాణి కూతురు సుప్రిత నాయుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఈ యువతి, తన గ్లామరస్ లుక్స్‌తో యూత్‌ను ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తాజాగా మరోసారి తన ఫోటోలతో కుర్రాళ్లను కట్టిపడేసింది. అర్థరాత్రి కారులో జోరుగా తిరుగుతూ, రోజా పూలతో కనిపించిన ఫోటోలు షేర్ చేసి నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది.
చీరలో ఉన్నప్పటికీ, తన అందాలతో కెమెరా ముందు హీట్ పెంచింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, “అబ్బా, ఏమి అందం!” ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం అంటూ.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సురేఖావాణి, సుప్రితల వీకెండ్ పార్టీలు చెప్పాలంటే చాలానే ఉన్నాయి.
టైమ్ దొరికితే చాలు.. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం, గోవా బీచ్‌లలో గ్లామర్ గా కనిపించడం , బ్యాంకాక్, దుబాయ్‌లలో చెలరేగడం వంటివి సుప్రిత రొటీన్. ఇక బీచ్ లొకేషన్స్‌లో రెచ్చిపోతూ, పబ్‌లలో పార్టీలతో యువతను మైమరపిస్తూ ఉంటుంది. లో దుస్తులతో తన అందాన్ని ఆరబోస్తూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా రెచ్చిపోతుందని టాక్ నడుస్తోంది. అంతకుముందు సురేఖావాణి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో, తన కూతురు సినిమాల్లోకి రావాలనుకుంటే నేను ఆపను .. అడ్డు కూడా చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే.సెలబ్రిటీ కూతురిగా సినిమాల్లో అడుగుపెట్టకముందే సుప్రిత సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది.