Mohan Babu | సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. కానీ చివరకు ఆయనకు ఊరట లభించింది. గత డిసెంబర్ 10వ తేదీన తన ఇంట్లోకి వచ్చారనే కోపంతో ప్రముఖ ఛానెల్ జర్నలిస్టుపై మోహన్ బాబు (Mohan Babu) దాడి చేయగా.. దానిపై కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
కానీ దాన్ని డిసెంబర్ 23న హైకోర్టు కొట్టేసింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇప్పుడు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇక చాలా రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్ తో మోహన్ బాబు, విష్ణుకు ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మనోజ్ మీద మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు మనోజ్ కూడా తన అన్న, తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తుల వివాదం కలెక్టర్ దాకా వెళ్లింది. కానీ ఇంకా ఏదీ కొలిక్కి రావట్లేదు.