rajani-kanth( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

Rajinikanth: సూపర్ స్టార్ మెచ్చిన విజువల్.. ఇంకేముంది ఇక బ్లాక్ బస్టరే..

Rajinikanth: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘మిరాయ్’. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో మూవీ మేకింగ్ తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. ‘మిరాయ్’ మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి అన్ని భాషల్లో ప్రచారం మొదలు పెట్టేశారు. తాజాగా తమిళనాడులో కూడా ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ను కూడా కండక్ట్ చేశారు నిర్మాతలు.

Read also-OG Glimpse: ‘ఓజీ’ గ్లింప్స్ చూశారా భయ్యా.. అయ్యబాబోయ్ ఊచకోతే..

తేజ సజ్జ హీరోగా నటిస్తున్న “మిరాయ్” సినిమా యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాను కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో తేజ సజ్జ “సూపర్ యోధుడు”గా ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్‌లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, తేజ సజ్జ స్టైల్, మాస్ ఎంట్రీ కలిసి ప్రేక్షకుల్లో భారీ హైప్ సృష్టించాయి. ఈ చిత్రంలోని తొలి పాట “వైబ్ ఉంది బేబీ” ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హిందీ హక్కులు తీసుకోవడం విశేషం. ఈ సినిమాను సెప్టెంబర్ 12, 2025న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, విజువల్స్, సూపర్ హీరో థీమ్ కలిసి ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

Read also-Alphabet Killer: 91 ఏళ్ల సీరియల్ కిల్లర్.. వీడి క్రైమ్ రికార్డ్ తెలిస్తే.. వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ఒక విజువల్ వండర్ అయ్యేలా ఉంది. ‘ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతుంది. అంటూ మెదలవుతోంది. అంటే కొన్ని గ్రంధాలను కాపాడటానికి తెజ సజ్జా తనకు తెలియకుండానే నియమించబడతాడు. వాటికి కాపాడటానికి పక్కవారితో ప్రేరేపించబడతాడు. మంచు మనోజ్ విలన్ గా బాగా సెట్ అయ్యారు. ‘నా ప్రస్తుతం ఊహాతీతం’ అన్న డైలాగ్ కు థియేటర్లు అదిరిపోయేలా ఉంది. యాక్షన్ సీక్వెన్సులు, వీఎఫ్ఎక్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ ను తలదన్నేలా ఉన్నాయి. జగపతి బాబు, శ్రేయ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారని తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే తెజ ఈ సారి రూ.500 కోట్ల మార్కును దాటేలా కనిపిస్తున్నాడు. ట్రైలర్ ని చూసిన తెజ సజ్జా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు