trimukha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Trimukha Teaser: పవర్‌ఫుల్ టీజర్‌తో ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్

Trimukha Teaser:  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్‌–ఇండియా మూవీ ‘త్రిముఖ’ టీజర్ విడుదల అయింది. రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అక్టోబర్ 18న విడుదలైన ఈ టీజర్‌లో సన్నీ లియోన్‌ను ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించింది. “ ఓటమి ఎరుగని శివంగి.. ఎదురుగా యుద్ధం వచ్చినా ఎప్పుడూ సిద్ధం. కానీ ఈసారి ఎదురైనది ఛేదించలేని పద్మవ్యూహం.. చుట్టూ సందిగ్ధం.. కనుసైగతో సమస్యను గ్రహించే విషయపరిజ్ఞాని.. సమస్తమూ చదివిన జ్ఞాని.. కానీ అహంకారాన్ని అదుపు చేసుకోలేని అజ్ఞాని!” అంటూ వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కు హైప్ ను తెచ్చాయి. ఈ టీజర్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సన్నీ లియోన్‌తో పాటు యోగేష్ కల్లె, అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆషూ రెడ్డి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

నిర్మాత డాక్టర్ శ్రీదేవి మద్దాలి మాట్లాడుతూ – “మా ‘త్రిముఖ’ టీజర్‌ను ఐదు భాషల్లో విడుదల చేయడం మా కథపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఈ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని ఆయన మాటల్లో చెప్పారు.

దర్శకుడు రాజేష్ నాయుడు మాట్లాడుతూ – “త్రిముఖతో భారతీయ సినిమా సరిహద్దులను దాటే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నేళ్ల శ్రమతో సృష్టించిన ఈ కొత్త ప్రపంచాన్ని టీజర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశాం. థియేటర్లలో ఓ విజువల్ వండర్‌గా నిలుస్తుంది,” అని చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘త్రిముఖ’, తన యాక్షన్ ఎలిమెంట్స్‌, విజువల్ గ్రాండ్యూర్‌, సన్నీ లియోన్ కొత్త అవతార్‌ వల్ల ఇప్పటికే భారీ అంచనాలను క్రియోట్ చేసింది. ఈ డిసెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?