Bipasha Basu
ఎంటర్‌టైన్మెంట్

Bipasha Basu: బిపాషా బసుపై స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు

Bipasha Basu: బిపాషా బసు.. పరిచయం అక్కరలేని పేరు. మహేష్ బాబు సినిమా ‘టక్కరి దొంగ’ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ వైపు వెళ్ళింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ డమ్ తెచ్చుకుంది. జిస్మ్, రాజ్, ధూమ్, రేస్, అలోన్, ఆత్మ, కార్పొరేట్, ది లవర్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కొంతకాలం డేటింగ్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్‌ గ్రోవర్‌ని ప్రేమించి 2016లో పెళ్లి చేసుకుంది. గతేడాది ఈ జంటకు కుమార్తె కూడా జన్మనిచ్చింది. ఇక అప్పటి నుంచి కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. 2020లో ‘డేంజరస్’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ డస్కీ బ్యూటీ బిపాషా బసు, తన పర్సనల్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది. తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఎలాంటి బాధలు అయినా.. ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.

అయితే తాజాగా బిపాసా బసు, ఆమె భర్త కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌పై స్టార్ సింగర్ మికా సింగ్‌ హాట్ కామెంట్స్ చేశారు. ఈ జంట వల్ల ఎంతో నష్టపోయానని వెల్లడించాడు. ఈ విషయం తలుచుకుంటూ ఎన్నో సార్లు బాధపడ్డానని తెలిపాడు. ఈరోజు బిపాసా బసు-కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ జంటకు అవకాశాలు రావడం లేదంటే.. వారు చేసుకున్న కర్మ ఫలమే అని పేర్కొన్నారు. బిపాసా బసు-కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ కీలక పాత్రల్లో నటించిన ‘డేంజరస్‌’ అనే వెబ్‌ సిరీస్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించానని పేర్కొన్నారు. అప్పటి వరకు పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తాను నిర్మాతగా మారానని తెలిపారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కు రూ. 4 కోట్ల బడ్జెట్ అంచనా పెట్టుకున్నానని, కానీ రూ.14 కోట్ల వరకు ఖర్చు పెట్టించారని, దీనికి కారణం ఈ ఇద్దరు కపులే అని పేర్కొన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ సమయంలో ఇద్దరు కలిసి ఎన్నో నాటకాలు ఆడారని వాపోయాడు. హెల్త్ బాగాలేదని ఒకరోజు భర్త, మరొక రోజు భార్య చెప్పేవారని అని తెలిపాడు.

Mika Singh

Also Read: హీరో తరుణ్‌తో ప్రియమణి లవ్.. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్? 

అయితే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ముద్దు సీన్స్ చేస్తారని ఆశించానని, కానీ కిస్ సీన్స్ చేయడానికి ఒప్పుకోలేదని తెలిపాడు. అలా చేయము..ఇలా చేయము అని ఎన్నో కండీషన్స్ పెట్టారని తెలిపాడు. వాళ్ళని చూసి అసలు నిర్మాతగా ఎందుకు వచ్చానూరో బాబు అనిపించిందని అన్నాడు. సినీ పరిశ్రమలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని, వారిని భరిస్తున్న నిర్మాతలు దేవుళ్లతో సమానమని పేర్కొన్నాడు. ఆ రోజు తనకు నష్టాలు తెచ్చి పెట్టారని, అందుకే ఈ రోజు వారికీ ఆ కర్మ పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం వారికి ఎవరు ఛాన్స్ లు ఇవ్వడం లేదని తెలిపాడు. అన్ని పైన ఉన్న దేవుడే చుసుకుంటాడని మికా సింగ్‌ పేర్కొన్నాడు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు