Thalassemia Awareness Event
ఎంటర్‌టైన్మెంట్

SS Thaman: నారా భువనేశ్వరిపై థమన్ ప్రశంసల వర్షం.. విషయమేమిటంటే?

SS Thaman: ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఆర్కే బీచ్‌రోడ్డులో తలసేమియాపై అవగాహన కోసం నిర్వహించిన రన్‌‌లో మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మ్యానేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. థమన్‌తో పాటు ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ముఖ్య అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓకే రాజేంద్రకుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని ఈ రన్‌ని విజయవంతం చేశారు. అనంతరం రన్ విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులని కూడా సత్కరించారు. అనంతరం గ్రాండ్ మ్యూజికల్‌ నైట్‌‌ను ఎస్.ఎస్. థమన్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. ‘‘నారా భువనేశ్వరి మేడమ్ చాలా గొప్పగా ఆలోచిస్తారు. సమాజం పట్ల వారి ఆలోచనలు ఎప్పుడూ నన్ను ఎంతగానో మెస్మరైజ్ చేస్తాయి. ఇలాంటి పనులు చేయడానికి నిజంగా గొప్ప మనసు కావాలి. అలాగే నమ్మకం కావాలి. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. భువనేశ్వరి మేడమ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా వుంది. ఫ్యూచర్‌లో మేడమ్ ఎటువంటి కార్యక్రమానికి పూనుకున్నా.. అందుకు నా సపోర్ట్ ఉంటుంది’’ అని అన్నారు.

Also Read- Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!

ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ మ్యానేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. తలసేమియా రన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒలింపిక్ పతాక విజేత కరణం మల్లేశ్వరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందంగా ఉంది. తలసేమియా గురించి ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ రన్ అని వారికి చెప్పినప్పుడు వెంటనే ఆమె కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. వారికి ధన్యవాదాలు. ట్రస్ట్ మీటింగ్‌కి వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది అమ్మలు చిన్నపిల్లల్ని పట్టుకుని ఎదురుచూసేవారు. ఎందుకు ఇక్కడ ఉన్నారని అడిగినప్పుడు.. వాళ్లు మాకు బ్లడ్ అవసరం మీరేమైనా సమకూర్చగలరా, తలసేమియాకు సంబంధించి మందులు ఇవ్వగలరా? అని అడిగారు. ఆ చిన్న పిల్లల్ని చూసినప్పటి నుంచి తలసేమియా గురించి ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో మొదటి భాగంగా విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహించాం. తమన్‌ని వెళ్లి కలిసినప్పుడు తలసేమియా పిల్లల కోసం నేను ఏమీ తీసుకోకుండా ఉచితంగా మీ ట్రస్ట్‌కి వర్క్ చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి దాతలు మా ట్రస్ట్ ను నమ్మి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మానవసేవే మాధవ సేవ అని నమ్ముతోంది. మేము ఎన్నో సేవా కార్యక్రమాల్ని ప్రజల కోసం చేస్తున్నాం. మా ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందికి పైగా అవసరమైన వారికి రక్తాన్ని అందించడం జరిగింది. 15 వేలకు పైగా ఆరోగ్య శిబిరాలు, సంజీవిని ఫ్రీ క్లినిక్ ద్వారా లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నాం. కష్టాల్లో ఉన్న మనిషికి అండగా నిలవడం కూడా ఒక గొప్ప దానం. భరోసా బాధపడే మనిషికి చాలా తృప్తిని ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రన్ లో మీరు వేసిన ప్రతి అడుగు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి భరోసా ఇచ్చినట్లయింది. ఈ రన్ లో పాల్గొని మీరందరూ బాధితులకు అండగా ఉన్నామని చాటి చెప్పడం ఆనందంగా ఉంది. దాతలకి, మీడియాకి, పోలీసు వారికి, గవర్నమెంట్ అధికారులకి, ఈ ప్రోగ్రాం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలని అన్నారు.

Also Read- Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో చూశారా.. ఇక టికెట్స్ తెగడమే!

కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ.. ఈ వ్యాధి గురించి అవేర్నెస్‌ నిమిత్తం రన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ లో సమాజానికి ఉపయోగపడే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసింది. తలసేమియాపై అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల బాధితులకు ప్రయోజనం జరగాలని నేను కోరుకుంటున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ కే రాజేంద్రకుమార్ కూడా మాట్లాడారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు