Sreeleela: హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robinhood). శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు హై బడ్జెట్‌తో నిర్మించారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించగా.. ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసి, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ శ్రీలీల మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..
Also Read- Shocking News: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ఆ స్టార్ డైరెక్టర్ కుమారుడు మృతి
‘‘రాబిన్‌హుడ్ సినిమాలో నా పాత్ర పేరు నీరా వాసుదేవ్. ఫారిన్ నుంచి ఇండియా వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. ఈ ప్రపంచమంతా నా చుట్టూనే భావించే పాత్ర. ఈ పాత్ర చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. నిజానికి రష్మిక చేయాల్సిన పాత్ర ఇది. తనకు ఈ పాత్ర ఎంతగానో నచ్చింది. కానీ డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేదు. పుష్ప 2 షూటింగ్‌లో కలిసినప్పుడు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. నాకు కూడా ఈ పాత్ర చాలా బాగా నచ్చింది.
నితిన్‌తో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఆల్రెడీ మేము కలిసి చేశాం. ఆయన ఫ్యామిలీ పర్సన్ లాగా ఉంటారు. సినిమాపై టీమంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమాలో విషయంలో మాకు చాలా టైం దొరికింది. చాలా క్వాలిటీతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సినిమాని ఆడియన్స్ మంచి హిట్ చేస్తారనే నమ్మకం ఉంది. ఈ సినిమాతో నితిన్, నాది హిట్ పెయిర్ అవుతుందనే నమ్మకముంది. ఇక వెన్నెల కిశోర్, నాకు మధ్య వచ్చే సీన్స్ హిలేరియస్‌గా ఉంటాయి. నటకిరీటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఆయన కామెడీ అదిరిపోతుంది. ఇంత ఫన్ ఉన్న సినిమాను నా కెరీర్లో ఇప్పటివరకు చేయలేదని మాత్రం చెప్పగలను.
Also Read- Kannappa: ‘కన్నప్ప’లో రఘుబాబు పాత్ర పేరేంటో తెలుసా? భయంకరంగా ఫస్ట్ లుక్!
నేను మైత్రి ఫ్యామిలీలో ఉన్నానని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. చాలా మంచి ప్రొడ్యూసర్స్. చాలా కంఫర్టబుల్‌గా చూసుకుంటారు. ఇంట్లో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ బ్యానర్‌లో అంత హ్యాపీగా ఉంటుంది. నేను బాలీవుడ్ వెళ్లిపోతున్నానని అంతా అనుకుంటున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పేది ఒక్కటే. తెలుగు సినిమా ఇండస్ట్రీ నా ఇల్లు. బాలీవుడ్‌కి వెళ్ళిపోవడం ఎప్పటికీ జరగదు. ఇంపాజిబుల్. కొత్తగా ‘పరాశక్తి’ అనే సినిమా చేస్తున్నాను. మాస్ రాజాతో ‘మాస్ జాతర’, కన్నడ-తెలుగులో ‘జూనియర్’తో పాటు ఇంకొన్ని సినిమాలు ఓకే చేశాను. త్వరలోనే వాటిని మేకర్స్ అనౌన్స్ చేస్తారు..’’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు