The Paradise film: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో హీరో నాని ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో, SLV సినిమాస్ పతాకంపై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్స్ సినిమా రేంజ్ ఏంటో తెలియజేస్తున్నాయి. తాజాగా మేకర్స్ బిహైండ్ ది సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. ‘హిట్ 3’ మాదిరిగా మరోసారి నాని ఊచకోత ఉండబోతుందనేది తెలుస్తోంది.
Also Read- Rana Daggubati: మూడు గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రానా నుంచి ఏం తీసుకున్నారంటే?
ఈ గ్లింప్స్‌ని పరిశీలిస్తే.. జైల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ (Spark of the Paradise) వీడియోలో.. రామోజీ ఫిలిం సిటీలో 15 రోజుల పాటు షూట్ చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ని పరిచయం చేశారు. ఈ గ్లింప్స్ ఎగ్జయిటింగ్‌గా ఉండటమే కాకుండా నాని అభిమానులకు మాస్ ట్రీట్ అన్నట్లుగా ఉంది. కత్తులు పట్టుకున్న ఖైదీలు చుట్టుముట్టినప్పటికీ.. నాని పాత్ర ఒంటరిగా, చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండా, ఏమాత్రం భయపడకుండా.. సీట్లో కూర్చొని ధైర్యంగా వారిని సవాలు చేస్తూ కనిపించడం చూస్తుంటే ‘హిట్ 3’ని మించిన నరుకుడు ఇందులో ఉంటుందనేది అర్థమవుతుంది. రెండు జడలు, ముఖం మీద గాట్లు, రఫ్ అండ్ టఫ్ లుక్‌తో నాని పవర్ ఫుల్‌గా ఈ గ్లింప్స్‌లో కనిపించారు. తన చుట్టూ గందరగోళంగా ఉన్నా.. సీట్లో కూర్చోని, కత్తులు పట్టుకున్న గుంపుని కూల్‌గా గమనించడం ఫెరోషియస్‌గా వుంది. జడల్‌కు సంబంధించిన డైలాగ్ కూడా ఇందులో వివరించారు. అలాగే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వాయిస్ కూడా ఇందులో హైలైట్ అవుతోంది.
Also Read- Nidhhi Agerwal: ప్రభుత్వ వాహనంలో స్టోర్ ఓపెనింగ్‌కు.. వివరణ ఇచ్చిన ‘వీరమల్లు’ హీరోయిన్!
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బోల్డ్ విజన్‌ని ఈ గ్లింప్స్ ప్రజెంట్ చేస్తోంది. నాని క్యారెక్టర్ డిజైన్ నుంచి ప్రతి ఫ్రేమ్ వరకూ తన బ్రిలియన్స్‌ని చూపించారు దర్శకుడు. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ వ్యాల్యూస్ మరో హైలైట్ అనేలా, ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అలాగే రా, రియలిస్టిక్ టోన్‌తో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ప్రతి ఫ్రేమ్‌కి థ్రిల్‌ని జోడించి, థ్రిల్ కలిగించే మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో రాఘవ్ జుయల్ కీలక పాత్ర చేస్తూ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. బలమైన క్యారెక్టర్స్‌తో కూడిన కథ, స్ట్రాంగ్ కంటెంట్‌తో పాటు విజువల్ ట్రీట్‌లో ఈ సినిమా ఉంటుందనేది ఇప్పటి వరకు వచ్చిన ప్రతీది తెలియజేస్తుండటంతో ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్.. మొత్తం ఎనిమిది భాషల్లో 26 మార్చి 2026న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు