Sonakshi Sinha: రీసెంట్‌గా బాలీవుడ్‌పై బాలీవుడ్ హీరోయిన్ అయిన సోనాక్షి సిన్హా సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. నటీనటుల భవిష్యత్ ఇక టాలీవుడ్‌లోనే అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అంతేకాదు, తను కూడా టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నట్లుగా ప్రకటించింది. అయితే, ఏ సినిమాలో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ ఇప్పుడు వచ్చేసింది. తాజాగా, ఆమె టాలీవుడ్‌లో పరిచయం కాబోతున్న చిత్రమేదో తెలిసింది. ఆ మూవీ మేకర్సే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, సోనాక్షి సిన్హా తెలుగులో నటిస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఇంతకీ ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఏదంటే..
Also Read- Happy Womens Day: ఓ మహిళా నీకు కంఫర్ట్ ఎ క డ?
నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధార’ (Jatadhara) మూవీతో సోనాక్షి సిన్హా తెలుగులోకి పరిచయం అవుతోంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే, ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో యాక్షన్, మిస్టరీతో కూడిన పవర్ ఫుల్ అవతార్‌లో ఆమె కనిపించనున్నారనేది అర్థమవుతోంది. ఇటీవల వచ్చిన ‘హీరామండి’ (Heeramandi)లో ఆమె ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ తర్వాత సోనాక్షి పౌరాణికాలు, యాక్షన్, అతీంద్రియ అంశాల మిళితమైన పాన్-ఇండియా చిత్రం ‘జటాధార’తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ఇటీవల ప్రేమికుల రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మౌంట్ అబూ అడవుల్లోకి వెళుతోంది. అక్కడ మౌకా స్టూడియోస్‌లో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని జీవం పోయడానికి ఒక అద్భుతమైన అడవి సెట్ నిర్మించినట్లుగా తెలుస్తోంది.

‘జటాధార’ చిత్రం ఓ అద్భుతమైన విజువల్ వండర్‌లా ఉండబోతుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా తాజాగా వచ్చిన సోనాక్షి పోస్టర్ కూడా ఉండటంతో, సినిమాపై మాములుగానే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ తరహా సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అందుకే భారీ క్యాస్టింగ్‌ని ఈ సినిమాకు యాడ్ చేస్తున్నారు. నూతన దర్శకుడు వెంకట్ కళ్యాణ్ (Venkat Kalyan Director) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ ఉమేష్ కెఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా, అరుణ అగర్వాల్, శివిన్ నారంగ్ నిర్మిస్తున్నారు. సోనాక్షి సిన్హా మార్చి 10 నుంచి ఈ సినిమా షూట్‌లో జాయిన్ అవుతారని టీమ్ తెలిపింది. సోనాక్షి సిన్హా ఎంట్రీతో ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది కాబట్టి, మేకర్స్ కంటెంట్ మీద గట్టిగా దృష్టి పెడితే చాలు, హిట్ కొట్టేసినట్లే అనేలా ఇండస్ట్రీలో టాక్ మొదలైంది.
ఇవి కూడా చదవండి:
Chiranjeevi: మెగాస్టార్ నుంచి మహిళలకు విషెస్ వచ్చేశాయ్.. స్పెషల్ ఏమిటంటే?
Bandla Ganesh: నేను రీ రిలీజ్ చేస్తా.. బ్లాక్‌బస్టర్ చేస్తారా?