Sonakshi Sinha | మ్యారేజ్ తర్వాత మతం మారిన సోనాక్షి సిన్హా?
Sonakshi Sinha
ఎంటర్‌టైన్‌మెంట్

Sonakshi Sinha: మ్యారేజ్ తర్వాత మతం మారిన సోనాక్షి సిన్హా?

Sonakshi Sinha: బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. హీందీలో అందరూ స్టార్ హీరోస్ నటించిన సోనాక్షి.. 2023 జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహమాడింది. ఈ జంట సుమారు 7 ఏళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వేరు వేరు మతాల చెందిన ఈ కపుల్ పెళ్లి చేసుకోవడం అప్పట్లో హాట్‌టాపిక్ అయ్యింది. అయితే వీరి పెళ్ళికి ఆమె సోదరులు అటెండ్ కాకపోవడంతో.. ఇష్టం లేకుండానే మ్యారేజ్ చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇక పెళ్లైన తెల్లారే సోనాక్షి హాస్పిటల్‌కి వెళ్లడంతో ఒక్కసారిగా ప్రెగ్నెన్సీ రూమర్స్ గుప్పుమన్నాయి. ఇప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏదోక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇంకా పెళ్లి చేసుకున్న సోనాక్షి మతం మారిందనే వార్తలు కూడా తెగ హల్‌చల్ అయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి తన పర్సనల్ విషయాలతో పాటు తనపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది.

జహీర్ ఇక్బాల్‌, తాను మతాల గురించి అంతగా పట్టించుకోమని చెప్పింది. తాము ఇద్దరం వేరు వేరు వ్యక్తులమని, లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని వెల్లడించింది. ఇక్బాల్‌ మతంలోకి తాను.. తమ మతంలోకి ఇక్బాల్‌‌ని రావాలని ఎప్పుడు అనుకోలేదని చెప్పింది. తమ మధ్య మతాల గురించి చర్చనే రాదని వివరించింది. ఇద్దరి సంప్రదాయాలు వేరు, ఒకరి మరొకరి సంప్రదాయాలు అర్థం చేసుకున్నామని, ఇద్దరి సంప్రదాయాలను గౌరవించుకుంటామని తెలిపింది. సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా డిఫరెంట్ పద్ధతులు ఉంటాయని, అలాగే తమ ఇళ్లలో కూడా వేరువేరు పద్దతులు ఉంటాయని, వాటిని ఇద్దరం పాలో అవుతామని చెప్పుకొచ్చింది.

Also Read: రాజమౌళిపై స్నేహితుడి ఆరోపణల్లో నిజం ఎంత..? 

తమ ఇంట్లో జరిగే హిందూ పండగలకు ఇక్బాల్‌ హాజరవుతాడని తెలిపింది. ముఖ్యంగా దీపావళికి హాజరై పూజ కార్య్రక్రమాల్లో పాల్గొంటాడని తెలిపింది. వాళ్ళింట్లో జరిగే పూజాల్లో తాను పాల్గొంటానని పేర్కొంది. తను ముస్లిం అబ్బాయిగా.. తాను హిందూ అమ్మాయిగా మతాలు మార్చుకోకుండా మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యామని తెలిపింది. అందుకే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యామని, అలా తమ రెజిస్టర్ మ్యారేజ్ జరిగిందని వెల్లడించింది. తమ మధ్య పెళ్లి విషయంలో ఎలాంటి సమస్య ఏర్పడలేదని స్పష్టం చేసింది. తనను ఎవరు మతం మార్చుకో అని ఎవరు చెప్పలేదని తెలిపింది. తాము ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది. ఇలా తనపై వస్తున్న రూమర్స్ అన్నింటికీ పులిస్టాప్ పెట్టింది. ఇక సోనాక్షి చివరిగా ‘కకుడా’ మూవీలో నటించింది. ప్రస్తుతం ‘నిఖిత రాయ్ అండ్ ది బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే చిత్రంలో నటిస్తోంది.

Just In

01

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!