Premaku Jai: కొన్ని పెద్ద సినిమాలు విడుదలవుతున్నప్పుడు చిన్న సినిమాలు విడుదల చేయడం ఏమంత మంచిది కాదు. సినిమాపై ఎంతో నమ్మకం, ధైర్యం ఉంటే తప్ప ఆ పని చేయలేరు. ఇప్పడలాంటి ధైర్యమే ప్రదర్శిస్తున్నారు ‘ప్రేమకు జై’ చిత్ర నిర్మాతలు. అవును, ఒక వైపు థియేటర్లలో ‘జాక్, జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ వంటి చిత్రాలు ఈ గురు, శుక్ర వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటి మధ్యలో ఓ చిన్న సినిమా రావడం అంటే నిజంగా దర్శకనిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. వారి ధైర్యానికి కారణం సినిమాలో ఉన్న కంటెంటే.
Also Read- PuriSethupathi: పూరీ-సేతుపతి సినిమాలో స్టార్ నటి.. ఎవరో తెలుసా?
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలలో, ఆ సంఘటనలను గట్టిగా పట్టుకుని సినిమాను రూపొందిస్తే, కచ్చితంగా అలాంటి సినిమాలకు తిరుగుండదు. అలాంటి కంటెంట్‌తోనే ‘ప్రేమకు జై’ క్యూరియాసిటీ కలిగిస్తూ వస్తుంది. ఓ గ్రామీణ నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అనిల్ బురగాని (Anil Buragani), జ్వలిత (Jwalitha) జంటగా నటించారు. శ్రీనివాస్ మల్లం (Srinivas Mallam) దర్శకత్వంలో అనసూర్య నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 11న (శుక్రవారం) గ్రాండ్‌గా థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ అన్నీ సిద్ధం చేశారు. దీంతో ఈ వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటి వరకు తెరపై చూడని ఓ అత్యద్భుతమైన ప్రేమకథను చూపించబోతున్నట్టుగా చిత్రయూనిట్ చెబుతూ వస్తుంది. అలాగే ప్రచార చిత్రాలు కూడా సినిమాపై క్రేజ్ ఏర్పడేలా చేశాయి. అందుకే కాన్ఫిడెంట్‌గా మేకర్స్ ఈ సినిమాను భారీ పోటీ మధ్య బరిలోకి దింపుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ, పల్లెటూరి నేపథ్యంలో వాస్తవంగా జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా వైవిధ్యంగా తెరకెక్కించాం. మా హీరో హీరోయిన్లు అనిల్ బురగాని, జ్వలిత మంచి నటనను కనబరిచారు. మా టీం అందరి కృషి వల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. అందరూ ఎంతగానో సహకరించారు. శుక్రవారం థియేటర్లో విడుదలయ్యే ఈ సినిమాను ప్రేక్షకులందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Kavya Thapar: కావ్య థాపర్ గ్లామర్ ట్రీట్‌కు వచ్చిందో ఛాన్స్!
నిర్మాత అనసూర్య మాట్లాడుతూ.. మా టీమ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. దర్శకుడు చాలా గొప్పగా ఈ సినిమాను రూపొందించారు. రేపు థియేటర్లలో ఈ సినిమాను చూసిన వారంతా ఆశ్చర్యపోతారు. అందరికీ చాలా రిలేటెడ్ అయిన ఓ ఇష్యూని ఇందులో చూపించాము. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నామని అన్నారు. మా ప్రయత్నాన్ని అందరూ సక్సెస్ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు. దుబ్బాక భాస్కర్ విలన్‌గా నటించిన ఈ చిత్రానికి చైతూ సంగీతం అందించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు