Madharaasi film: శివ కార్తికేయన్ ‘మదరాసి’ ట్రైలర్ ఎప్పుడంటే?
madarasi( image :x)
ఎంటర్‌టైన్‌మెంట్

Madharaasi film: శివ కార్తికేయన్ ‘మదరాసి’ ట్రైలర్ ఎప్పుడంటే?

Madharaasi film: శివ కార్తికేయన్ నటించిన, ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘మదరాసి’ (Madharaasi film) చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం ఆగస్టు 24, 2025న జరగనుంది. ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్ సినీ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌గా ఉండబోతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మదరాసి’ ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. శివ కార్తికేయన్ ఈ చిత్రంలో ‘రఘు’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్, బిజు మీనన్, విక్రాంత్, షబీర్ కల్లరక్కల్, ప్రేమ్ కుమార్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Read also- Khairatabad Bada Ganesh 2025: ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడు.. ఎన్ని అడుగలంటే?

ఇప్పటికే విడుదలైన సెలవిక (తెలుగు) సింగిల్ ట్రాక్‌లు ప్రేక్షకుల నుండి గొప్ప స్పందనను రాబట్టింది. దీంతో అనిరుధ్ పూర్తి ఆల్బమ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ చిత్రం ఎ.ఆర్. మురుగదాస్‌కు తమిళ సినిమాలో గ్రాండ్ రీ-ఎంట్రీగా భావిస్తున్నారు. ఆయన గత చిత్రాలైన ‘గజినీ’ ‘తుపాకీ’ లాంటి బ్లాక్‌బస్టర్‌ల స్టైల్‌ను మదరాసిలో కలగలిపినట్లు మురుగదాస్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రం ఒక లవ్ స్టోరీ చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామాగా ఉంటుందని, ప్రేమ కథ యాక్షన్‌కు డ్రైవింగ్ ఫోర్స్‌గా నిలుస్తుందని ఆయన తెలిపారు. శివ కార్తికేయన్ పాత్ర ఒక సైకలాజికల్ డిజార్డర్‌తో కూడిన ఒక పాత్రగా ఉండవచ్చని, బహుశా బైపోలార్ డిజార్డర్‌తో సంబంధం కలిగి ఉండవచ్చని ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Read also- Sack Jailed Ministers Bill: పీఎం, సీఎంలను తొలగించే బిల్లుపై.. మోదీ ఫస్ట్ రియాక్షన్.. విపక్షాలపై తీవ్రంగా ఫైర్!

ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలోని సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆగస్టు 24న జరగనుంది. ఈ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. దీనివల్ల ఈ కార్యక్రమం మరింత ఆకర్షణీయంగా మారనుంది. శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్.వి. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సినిమాటోగ్రఫీని సుదీప్ ఎలమన్, ఎడిటింగ్‌ను ఎ. శ్రీకర్ ప్రసాద్ నిర్వహించారు. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. థియేటర్లలో భారీ హోర్డింగ్స్, బ్యానర్స్‌తో ప్రమోషన్స్ జోరుసోరుగా సాగుతోంది. శివ కార్తికేయన్ అమరన్ విజయం తర్వాత, మదరాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా, మురుగదాస్ సిగ్నేచర్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..