Daksha Movie
ఎంటర్‌టైన్మెంట్

Manchu Manoj: ముందు అక్క సినిమా వస్తోంది.. తర్వాత ‘ఓజీ’.. మూవీ లవర్స్‌కు ఫీస్ట్!

Manchu Manoj: ‘ముందు అక్క సినిమా వస్తోంది.. ఆ తర్వాత ‘ఓజీ’ (OG) వస్తుంది.. ఈ మంత్ అంతా మూవీ లవర్స్‌కు ఫీస్ట్!’ అని అన్నారు రాక్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj). మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi Prasanna) ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఈ సినిమాలో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారి ఈ చిత్రంలో నటించడం విశేషం. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ఈ నెల 19న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు లక్ష్మి సోదరుడు, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మూవీ లవర్స్‌కు ఫీస్ట్

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. మా ‘మిరాయ్’ మూవీని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులందరికీ థ్యాంక్స్. నెక్ట్స్ వీక్ అక్క, నాన్న కలిసి నటించిన ‘దక్ష’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను కూడా మీరంతా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ‘దక్ష’ సినిమా కోసం అక్క ఎంతో కష్టపడింది. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ హిట్ అయ్యింది. తమ్ముడు సాయి ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మా ‘మిరాయ్’ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఒకే రోజు రెండు చిత్రాలు రిలీజై.. మంచి విజయం సాధించాయి. నెక్ట్స్ ‘దక్ష’ రాబోతోంది, ఆ తర్వాత పవనన్న ‘ఓజీ’ వస్తోంది. ఈ నెల మూవీ లవర్స్‌కు ఫీస్ట్ అని చెప్పొచ్చు. అన్ని సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. మన తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

Also Read- Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్!

నాన్నతో అలాంటి సినిమా చేయాలని ఉంది

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘దక్ష’ కథను నా దగ్గరకు నాన్న తీసుకొచ్చారు. నిజంగా నాన్నే ఈ కథను తీసుకొచ్చారా? అనేది మొదట్లో నమ్మలేకపోయాను. ప్రతి చిత్రంతో మనకొక టీమ్ తయారవుతుంది. మహేశ్, జెమినీ సురేష్ వంటి కో- ఆర్టిస్టులతో నాకు కొత్త టీమ్ ఫార్మ్ అయ్యింది. ఈ సినిమాకు పనిచేసిన వారంతా ప్రాణం పెట్టి పని చేశారు. మహేశ్ అయితే ప్రమోషన్స్ గురించి ఎలా చేయాలో చెప్పేవాడు. ఈ చిత్రంలో నాన్న ఇమేజ్‌కు తగినట్లుగా మంచి క్యారెక్టర్ ఉంది. అందుకే ఆయననే అడిగాం. పాన్ ఇండియా వైజ్ చూస్తే.. ప్రతి భాష నుంచి పేరున్న ఆర్టిస్టులు మా చిత్రంలో నటించారు. నాన్న తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజ్. తను సినిమాలు చేయనప్పుడు ఇలాంటి మంచి ఆర్టిస్ట్ స్క్రీన్ మీద మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడా? అని ఒంటరిగా బాధపడ్డాను. మనోజ్ హీరోగానే కాదు విలన్‌గానూ మెప్పించగలడు, కామెడీ చేయగలడు. వర్సటైల్ యాక్టర్‌గా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాకు మనోజ్ ఇచ్చిన సజెషన్స్‌ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనోజ్‌కు ఫిలిం మేకింగ్ మీద, ప్రతి క్రాఫ్ట్ మీద పట్టుంది. నాన్నతో అమితాబ్ ‘పీకూ’ లాంటి మూవీ చేయాలని ఉంది. నటిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. తమిళం, మలయాళంలో కూడా నటించాను. నా దగ్గరకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ, ముందుగా నటిగా వచ్చి, ఆ తర్వాత ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారు. ప్రొడక్షన్ అనుకున్నంత ఈజీ కాదు. మా చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ వాళ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ‘కన్నప్ప, మిరాయ్’ తర్వాత వాళ్లకు మా సినిమా హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Sai Durgha Tej: ‘విన్నర్’ సినిమా తర్వాత అలాంటి పాటలు చేయడం మానేశా..

అంకితభావం ఉన్నవాళ్లు కాబట్టే

డైరెక్టర్ వంశీకృష్ణ మల్లా మాట్లాడుతూ.. ‘దక్ష’ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రస్తుతం ఇలాంటి తరహా మూవీస్‌నే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు, ఆదరిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు లక్ష్మి అక్కకు ధన్యవాదాలు. ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ సహా ఎంతోమంది పెద్దవాళ్లను డైరెక్ట్ చేశాను. వాళ్లు నటనపట్ల అంకితభావం ఉన్నవాళ్లు కాబట్టే.. అంత పై స్థాయిలో ఉన్నారు. ఈ నెల 19న మా ‘దక్ష’ మూవీ థియేటర్లలోకి వస్తుంది. అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మనోజ్ అన్న అభిమానిని. ‘మిరాయ్’ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక నాకు కన్నీళ్లు ఆగలేదు. విష్ణు అన్న ‘కన్నప్ప’, మనోజ్ అన్న ‘మిరాయ్’ సక్సెస్ అయినట్లే లక్ష్మి అక్క ‘దక్ష’ సినిమా కూడా ఘన విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకువస్తుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Mirai Movie: ‘మిరాయ్’ మూవీని తిరస్కరించిన హీరో ఎవరో తెలుసా?

Charan and Upasana: రామ్ చరణ్, ఉపాసన దంపతులు చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా?

TG Vishwa Prasad: రజినీకాంత్ ‘అరుణాచలం’ టైప్ కాదు.. నాకు డబ్బు విలువ తెలుసు!

BRS BJP talks: బెడిసిన గులాబీ వ్యూహం… బీజేపీ నేతలతో ఇద్దరు కీలక నేతల భేటీ?

Manchu Manoj: ముందు అక్క సినిమా వస్తోంది.. తర్వాత ‘ఓజీ’.. మూవీ లవర్స్‌కు ఫీస్ట్!