rahul-sipliganj(x)
ఎంటర్‌టైన్మెంట్

Rahul Sipligunj wedding: టాలీవుడ్ స్టార్ సింగర్ పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి తొలి ఆహ్వానం..

Rahul Sipligunj wedding: ప్రైవేట్ ఆల్బమ్స్‌తో మొదలుపెట్టి, సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్. ఆయన ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. “రంగస్థలం”, “నాటు నాటు” వంటి పాటలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాహుల్.. నవంబర్ 27న తాను ప్రేమించిన అమ్మాయి, హరిణ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల జరిగిన ఈ స్టార్ సింగర్ నిశ్చితార్థం, తాజా వివాహ ఆహ్వానం వార్తలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read also-Tulasi retirement: సినీ ప్రస్థానానికి వీడ్కోలు పలికిన సీనియర్ నటి తులసి.. ఇక నుంచి సాయిబాబా సేవలో..

ప్రైవేట్ ఆల్బమ్స్ నుండి ఆస్కార్..

“మాకి కిరికిరి”, “చాయ్ మాటిక్” వంటి యూట్యూబ్ ప్రైవేట్ ఆల్బమ్స్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు రాహుల్ సిప్లిగంజ్. ముఖ్యంగా హైదరాబాద్ యాసలో, స్థానిక సమస్యలపై ఆయన రాసి, పాడిన పాటలు కోట్లాది మందిని ఆకట్టుకున్నాయి. ఈ క్రేజ్ ఆయనకు సినీ రంగంలో అవకాశాలను తెచ్చిపెట్టింది. టాలీవుడ్‌లో వరుసగా హిట్‌ పాటలు పాడుతూ బిజీ సింగర్‌గా మారారు. అయితే, ఆయన కెరీర్‌లో అత్యంత కీలక మలుపు ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట. ఈ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం, అమెరికాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా పర్ఫార్మ్ చేయడం తెలుగు సినీ చరిత్రలో మరపురాని ఘట్టం. ఈ ఒక్క పర్ఫార్మెన్స్‌తో రాహుల్ సిప్లిగంజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. స్టార్ సింగర్‌గా, గ్లోబల్ ఆర్టిస్ట్‌గా ఆయన స్థాయి అమాంతం పెరిగింది.

నవంబర్ 27 పెళ్లి ..

పెరుగుతున్న కెరీర్ గ్రాఫ్‌తో పాటు, రాహుల్ వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త శకం ప్రారంభమైంది. రాహుల్, తన ప్రేయసి హరిణ్య రెడ్డితో కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో వీరి నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. వారిద్దరి పెళ్లి గురించి అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వివాహ తేదీ కూడా ఖరారైంది. రాహుల్ సిప్లిగంజ్ – హరిణ్య రెడ్డిల వివాహం నవంబర్ 27న వైభవంగా జరగనుంది. హైదరాబాద్‌లోని ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున హాజరు కానున్నట్లు సమాచారం.

Read also-Priyanka remuneration: ‘వారణాసి’ సినిమా కోసం ప్రియాంకా చోప్రా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

తొలి ఆహ్వానం సీఎం రేవంత్ రెడ్డికి..

తాజాగా, రాహుల్ సిప్లిగంజ్ తన పెళ్లికి సంబంధించిన తొలి ఆహ్వానాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. తన కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఈ నూతన జంటను ఆశీర్వదించి, వివాహానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లుగా రాహుల్ సిప్లిగంజ్ తెలిపారు. ‘నాటు నాటు’ పాటతో తెలుగు కీర్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన రాహుల్ పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి రాక, ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. టాలీవుడ్ టాప్ సింగర్ పెళ్లి పీటలెక్కడంతో టాలీవుడ్ లో సందడి నెలకోంది.

Just In

01

Supreme Court: సుప్రీం తీర్పుపై ఉత్కంఠ.. నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ..!

Puzzle: 30 సెకన్ల ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఎన్ని ” Y ” లు ఉన్నాయో చెప్పగలరా? మీ ఐక్యూ టెస్ట్ చేసుకోండి!

BC Reservations: గందరగోళంలో బీసీ లీడర్లు.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా సాధ్యం..?

Konda Madhavi Latha: బ్రదర్ అంటూనే రాజమౌళిపై ఫైర్ అయిన బీజేపీ నాయకురాలు.. మూలాలపై అలాంటి మాటలా..

Tirumala News: తిరుమల భక్తులు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయాలు..!