Siddu Jonnalagadda: యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘డీజే టిల్లు’ , ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించి, తన విలక్షణమైన డైలాగ్ డెలివరీతో సినీ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. అయితే, ‘టిల్లు’ ఇమేజ్ కొంత వరకు బాగానే కలిసి వచ్చింది కానీ, ఇప్పుడు అదే మనోడి కొంప ముంచుతుంది. అదే స్టైల్ ను తీసుకొచ్చి ‘జాక్’ లో కూడా చూపించాడు ఘోరంగా విఫలమైంది.
ఈ సినిమా కారణంగా సిద్ధు తన పారితోషికాన్ని కూడా తగ్గించుకోవాల్సి వచ్చిందని బహిరంగంగా మీడియా ముందు చెప్పాడు. ఈ పరాజయాలను దాటి మళ్ళీ సక్సెస్ కొట్టాలని , సిద్ధు మళ్లీ తన సొంత శైలిలో రీఎంట్రీ ఇచ్చాడు. ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం, నీరజా కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెలుసు కదా’ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై, హైప్‌ను పెంచింది. ట్రైలర్‌లో ‘టిల్లు’ తరహా డైలాగ్‌లు కొన్ని కనిపించినప్పటికీ, సిద్ధు ఆ స్టైల్ ని ఫాలో అవ్వలేదని దర్శకురాలు నీరజా కోన క్లారిటీ ఇచ్చింది. కానీ, ట్రైలర్ చివరలో కనిపించిన కొన్ని బోల్డ్ సన్నివేశాలను ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి సిద్ధు సమాధానం ఇస్తూ, ఆ సన్నివేశాలు సినిమాలో ఉండబోవని తేల్చి చెప్పాడు. తన కొత్త పాత్ర ‘టిల్లు’ క్యారెక్టర్‌కు పూర్తిగా భిన్నంగా, ఎమోషన్స్ తో ఉంటుందని చెప్పాడు.
ఈ మూవీలో డ్రామా, బలమైన భావోద్వేగాలు, కుటుంబ బంధాలు కీలకంగా ఉంటాయని తెలిపాడు. ‘జాక్’ సినిమా ఫ్లాప్ తర్వాత దర్శకుడు కొరటాల శివ ఇచ్చిన సలహా ఒక పాఠం లాగా గుర్తుంటుందని చెప్పాడు. “టిల్లుతో ఆకాశంలో ఎగిరావు, జాక్‌తో నేల మీద పడ్డావు. ఇక ఏం చేసినా, రెండింటి మధ్యలోనే చేయాలనీ” చెప్పాడు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సిద్ధు ధీమాగా చెప్పుకొచ్చాడు.
