Siddu Jonnalagadda Badass Still
ఎంటర్‌టైన్మెంట్

Siddhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు ఊర మాస్ టైటిల్ ఫిక్స్.. ఫస్ట్ లుక్ విడుదల

Siddhu Jonnalagadda: ‘డీజే టిల్లు’ (DJ Tillu) సిరీస్ సినిమాలతో హీరోగా తనకంటూ కొత్త పంథాను ఏర్పరచుకున్న నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమా నుంచి సిద్ధు రేంజ్ మారిపోయింది. చిన్నపాటి స్టార్ ఇమేజ్ అతనికి వచ్చేసింది. ‘డీజే టిల్లు’ సిరీస్ సినిమాలు తప్పితే వేరే సినిమాలు హిట్ కాకపోయినప్పటికీ, ఆయనకు వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్‌ని మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్‌ పేరెపు కలయికలో రాబోతున్న ఈ సినిమాకు ‘బ్యాడాస్’ (BADASS) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టైటిల్ ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా..

Also Read- Samantha: సమంత, రాజ్ ని అక్కడే పెళ్లి చేసుకుంటుందా.. ఈ పోస్ట్ తో కన్ఫర్మ్?

ఎక్కడో కాదు.. కోలీవుడ్ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లియో’ సినిమాలో ఓ సాంగ్ ఈ లిరిక్‌‌తోనే మొదలవుతుంది. ఇప్పుడు అదే లిరిక్‌ని సిద్ధు తన సినిమా టైటిల్‌గా పెట్టుకున్నారు. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సిద్ధును ఇంతకు ముందు ఎన్నడూ చూడని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, ప్రేక్షకులకు కావాల్సినంత కిక్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ మంచి నటుడే కాదు, రచయిత కూడా. ఆ విషయం అందరికీ తెలిసిందే. ‘బ్యాడాస్’ సినిమాకి రవికాంత్ పేరేపుతో పాటు సిద్ధు జొన్నలగడ్డ రచయితగా వ్యవహరిస్తున్నారు. రవికాంత్ పేరపు దర్శకత్వం వహిస్తున్నారు. బలమైన కథ, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం పరిమితులను అధిగమించి, సంచలన విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎమోషనల్ డ్రామాలలో ఒకటిగా సిద్ధమవుతోంది.

Also Read- Siva Shakthi Datta: 16 ఏళ్లు ఇండస్ట్రీ వదిలేసి.. శివ శక్తి దత్తా గురించి ఈ విషయం తెలుసా?

నిర్మాతలు టైటిల్‌తో కూడిన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ‘If middle finger was a man’ అనే బోల్డ్ స్టేట్మెంట్‌తో ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈరోజుల్లో సినిమాకి సంబంధించిన మొదటి పోస్టర్‌తోనే ప్రేక్షకులను ఆకర్షించడం అంత సులభమైన విషయం కాదు. కానీ, ‘బ్యాడాస్’ చిత్ర బృందం మొదటి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించి, సినిమాపై అంచనాలను క్రియేట్ చేశారు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ సిరీస్ చిత్రాల ఘన విజయం తర్వాత వారి నిర్మాణంలో వస్తున్న ముచ్చటగా మూడో చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు