Shiva Re-Release: టాలీవుడ్ చరిత్రను మలుపు తిప్పిన చిత్రం ‘శివ’. ఈ చిత్రం కింగ్ నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలయికలో వచ్చి అప్పట్లో సంచలనం సష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా రీ-రిలీజ్‌లోనూ తన సత్తా చాటుతోంది. 1989లో విడుదలై, తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన ఈ క్లాసిక్ చిత్రం. అధునాతన 4కే ఫార్మాట్‌లో మళ్లీ థియేటర్లలోకి వచ్చి.. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.3.95 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రీ రిలీజ్ లో కూడా శివ సినిమా ట్రెండ్ సెట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
Read also-Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..
35 సంవత్సరాల క్రితం ‘శివ’ విడుదలైనప్పుడు తెలుగు చిత్రసీమలో ఒక విప్లవంలా మారింది. నాగార్జున కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, రామ్ గోపాల్ వర్మ అనే ఒక సరికొత్త, అసాధారణ దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆనాటి కాలేజ్ పాలిటిక్స్, గ్యాంగ్‌వార్ నేపథ్యాన్ని వాస్తవికతకు దగ్గరగా చూపించిన విధానం, హీరో (నాగార్జున) సైకిల్ చైన్ పట్టుకునే స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ అప్పటి యువతను ఉర్రూతలూగించింది. కేవలం రూ.1.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, అప్పట్లో రూ.4 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది.
తాజాగా, మెరుగైన డాల్బీ సౌండ్, 4కే విజువల్స్‌తో రీ-రిలీజ్ అయిన ‘శివ’, మళ్లీ శుక్రవారం రోజున థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. మొదటి రోజు నుంచే ప్రేక్షకులనుంచి అద్భుతమైన ఆదరణ లభించింది. తొలిరోజునే ఈ సినిమా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక రెండు రోజుల్లో ఈ కలెక్షన్ రూ.3.95 కోట్లు దాటడం విశేషం. ఈ ఘన విజయం ముఖ్యంగా నాగార్జునకున్న తిరుగులేని క్రేజ్‌కు, అలాగే ‘శివ’ సినిమా కంటెంట్‌కు నేటి తరం ప్రేక్షకులు సైతం కనెక్ట్ అవ్వడానికి నిదర్శనం. ఆరోజుల్లో సినిమాను చూసి థ్రిల్ అయిన పాత తరం అభిమానులే కాకుండా, కొత్తగా వచ్చిన యువతరం కూడా ఈ క్లాసిక్‌ను చూడటానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ అసాధారణ స్పందనతో, ‘శివ’ రీ-రిలీజ్ అయిన చిత్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి.
#SHIVA THANDAVAM at the box office 👊🔥#Shiva4K grosses 3.95Crores+ worldwide in 2 days 💥💥💥
Enjoy the weekend with cult in cinemas now!
— https://t.co/vdUYG2JnoqExperience it in 4K DOLBY ATMOS with Music engineered by Artificial Intelligence. #50YearsOfAnnapurna… pic.twitter.com/xMV6otcgk3
— Annapurna Studios (@AnnapurnaStdios) November 16, 2025
