Shambala Movie Review: ఆది సాయికుమార్ ‘శంబాల ఫుల్ రివ్యూ..
sambala-review
ఎంటర్‌టైన్‌మెంట్

Shambala Movie Review: ఆది సాయికుమార్ ‘శంబాల’ ప్రపంచం ఎలా ఉందో తెలియాలంటే?.. ఫుల్ రివ్యూ..

  • చిత్రం: శంబాల
  • నటీనటులు: ఆది సాయికుమార్‌, అర్చనా అయ్యర్‌, శ్వాసిక విజయ్‌, మధునందన్‌, హర్షవర్థన్‌, రవి వర్మ, శివ కార్తిక్‌ తదితరులు
  • సంగీతం: శ్రీచరణ్‌ పాకాల
  • సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌
  • ఎడిటర్‌: శర్వణ్‌
  • దర్శకత్వం: యుగంధర్‌ ముని
  • విడుదల: 25-12-2025

గత కొంత కాలంగా హిట్ సినిమాలు పడక ప్రేక్షకులకు దూరంగా ఉంటున్న హీరోల్లో ఆది సాయికుమార్ ఒకరు. కెరీర్ మెదట్లో వరుసగా హిట్లు కొట్టినా తర్వాత ప్రయోగాల పేరుతో చేతులు కాల్చుకున్నారు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో ‘శంబాల’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రమోషన్లు కూడా భారీ గానే చేశారు. సాయి కుమార్ కూాడా ఈ సినిమాతో ఆది హిట్ సాధిస్తాడు అనే నమ్మకంతోనే ఉన్నారు. సినిమా ప్రమోషన్ లోకూడా అదే హైప్ ఉండేలా చూసుకున్నారు. అయితే ఈ సినిమా వారు ఆసించిన ఫలితాలు ఇచ్చిందా? సాయి కుమార్ నమ్మకాన్ని నిలబెట్టిందా? తెలుకోవాలంటే..

కథాంశం

Shambala Movie Review: 1980ల నేపథ్యంలో కథ సాగుతోంది. శంబాల అనే చిన్న గ్రామంలో ఒక ఉల్క పడుతుంది. దాని తర్వాత గ్రామంలో అనూహ్య సంఘటనలు, మరణాలు జరుగుతాయి. గ్రామస్థులు దీనిని దుష్ట శక్తి లేదా దైవ కోపంగా భావిస్తారు. జియాలజిస్ట్, నాస్తికుడైన విక్రమ్ (ఆది సాయికుమార్) ఆ ఉల్కను పరిశోధించడానికి గ్రామానికి వస్తాడు. అతని రాక తర్వాత మరిన్ని మరణాలు జరుగుతాయి. గ్రామస్థులు విక్రమ్‌ను నిందిస్తారు. శంబాల గ్రామ చరిత్ర, దైవ భక్తి, సైన్స్ మధ్య సంఘర్షణ ఏమిటి? విక్రమ్ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు? అనేది మిగతా కథ. ఇది హారర్, మిస్టరీ, డివోషనల్ ఎలిమెంట్స్‌తో కూడిన కథ.

విశ్లేషణ

శంబాల అనే ఊరిలో పడిన ఉల్కను పరిశీలించడానకి ప్రభుత్వం తరఫున వచ్చిన పరిశోధకుడే ఆది సాయికుమానర్. నాస్తికుడిగా ఊరిలోకి వచ్చిన ఆది ఎలా దేవుళ్లను నమ్మాల్సి వస్తుంది. ఉల్క అనే బండ భూతం వల్లే ఇదంతా జరుగుతుందని అనుకుంటున్న గ్రామస్తులకు ఆది అదంతా మూఢ నమ్మకం అని చెప్పడానకి ప్రయత్నిస్తాడు. దీనిని నమ్మని ఊరి జనం ఆదిని చంపడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోొ జరిగే శన్నివేశాలు చాలా బాగా కంపోజ్ చేశారు. ఆది సాయికుమార్ ఒన్ మ్యాన్ షోలా కనిపిస్తుంది. ఆది గత సినిమాల కంటే ఈ సారి పాత్రలో బాగా ఇన్వాల్ అయి చేశారు. హీరోయిన్ అర్చన కు కమర్షియల్ సీన్లు లేకపోయినా ఆ పాత్రకు తగ్గ న్యాయం చేశారు. ప్రధమార్ధంలో వచ్చిన కొన్ని ప్రశ్నలకు సెకండాఫ్ సమాధానాలు దొరుకుతాయి. ఈ సినిమా కథనాన్ని దర్శకుడు పక్కాగా రాసుకుని తెరకెక్కించారు. విజువల్ పరంగా కొన్ని చోట్ల బాగానే ఉన్నా.. దానిపై మరింత శ్రద్ధ పెడితే బాగుండేది. చాలా సంవత్సరాల తర్వాత ఆది సాయికుమార్ ప్రేక్షకులను కర్చీల నుంచి లేవకుడా చేశారు. మొత్తంగా ఈ సినిమా ఆది కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది.

నటీనటులు..

ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో ఆది తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నాస్తికుడిగా, ఇంటెన్స్ సీన్స్‌లో మెచ్యూర్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. అర్చన అయ్యర్ దేవి పాత్రలో సర్‌ప్రైజ్ చేశారు. స్వాసిక విజయ్ చేసిన ఇంటర్వెల్ ముందు వచ్చే పాత్ర హైలేట్ గా ఉంటుంది. మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్ తదితరులు సపోర్టింగ్ రోల్స్‌లో బాగా చేశారు. మొత్తంగా ఈ సినిమాలో ఆదితో పాటు సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పొటీపడి నటించారు.

టెక్నికల్‌గా..

ఇక టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకుంటే.. దర్శకడిగా యుగంధర్ ముని మంచి కోర్ పాయింట్‌తో కథను గ్రిప్పింగ్‌గా నడిపించాడు. సైన్స్, డివోషన్ కలిపి నడిపించిన కథనం చాలా కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, ఫస్టాఫ్ మిడ్ పార్ట్స్ నెమ్మదిగా.. పతాక సన్నివేశం సింపుల్‌గా ముగిసినట్టు అనిపిస్తుంది. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్. సన్నివేశాలను ఎలివేట్ చేసింది, సౌండ్ డిజైన్ కూడా నీట్‌గా కొత్తగా అనిపించింది. ప్రవీణ్ కే బంగార్రి విజువల్స్ చాలా బాగా వచ్చాయి. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ సెకండాఫ్‌లో మంచి పేస్ ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ సాలిడ్ గానే ఉన్నాయి కానీ కొన్ని ఏఐ విజువల్స్ అనుకున్న స్థాయిలో లేవు. మొత్తంగా టెక్నికల్‌గా సినిమా అన్ని డిపార్ట్ మెంట్లు కలిసి పనిచేశాయి అనే చెప్పాలి.

బ‌లాలు

క‌థ‌నంలో మంచి గ్రిప్
న‌టీన‌టులు
సంగీతం

బ‌ల‌హీన‌త‌లు

క్లైమాక్స్

మొత్తంగా.. మనుషుల్లో ఉన్న మరో ప్రపంచమే ‘శంబాల’.

రేటింగ్ – 3 / 5

 

Just In

01

HMD Pulse 2: HMD నుంచి కొత్త Pulse 2.. లాంచ్ కు ముందే లీకైన పీచర్లు, స్పెసిఫికేషన్లు

Telangana Farmers: రాష్ట్రంలో రైతులకు గుడ్ న్యూస్.. రైతు యాంత్రికరణ పథకం పునః ప్రారంభం!

Allu Arjun: మళ్లీ అల్లు అర్జున్‌తోనే ‘గాడ్ ఆఫ్ వార్’.. త్రివిక్రమ్ మైథలాజికల్ మూవీపై క్లారిటీ!

Desk Journalists: అక్రిడిటేషన్​ కార్డుల జీవో 52 ను సవరించాలని.. టీజేఎఫ్​టీ డిమాండ్..!

Honor Win Series: స్మార్ట్‌ఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్.. డిసెంబర్ 26న Honor Win సిరీస్ లాంచ్