Seetha Payanam: ‘సీతా పయనం’ నుంచి మెలొడీ సాంగ్ వచ్చింది..
Seetha-Payanam
ఎంటర్‌టైన్‌మెంట్

Seetha Payanam: ‘సీతా పయనం’ నుంచి రొమాంటిక్ మెలొడీ సాంగ్ వచ్చింది.. ఓ లుక్కేయండి..

Seetha Payanam: శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.

Read also-Dhurandhar OTT: రేపే ఓటీటీలోకి రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో ‘పయనమే’ పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను కాసర్ల శ్యాం రచించారు. అనూప్ రూబెన్స్ అందించిన బాణీ ఎంతో క్యాచీగా ఉంది. ఈ మెలోడియస్, రొమాంటిక్ పాటను అనూప్ రూబెన్స్, సత్య ప్రకాష్ కలిసి ఆలపించారు. ఇక ఈ పాటలో అర్జున్, అనూప్ రూబెన్స్ కనిపించి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీని కూడా ఈ లిరికల్ వీడియోలో చక్కగా చూపించారు.

Read also-Varanasi: మహేష్ బాబు ‘వారణాసి’ అప్పుడే ప్రచారం మొదలెట్టేశారా?.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమా విడుదల కోసం అర్జున్ ఫ్యాన్స్ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?