Samantha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Samantha: నన్ను గెలకొద్దు.. వాళ్ళకి మాస్ వార్నింగ్ ఇచ్చిన సమంత?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలతో పాటు సినిమాలను కూడా నిర్మిస్తూ ఫుల్ బిజీ అయింది.ముంబైలో ఎక్కువగా కనిపిస్తున్న సామ్, ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరుగాంచింది. ఫుడ్ లేకపోయినా పర్లేదు కానీ, వర్కౌట్స్ చేయకుండా తాను ఉండలేనని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా సమంతలో ఎన్నో మార్పులు వచ్చాయి.

సమంత బాగా బరువు తగ్గింది, ఫేస్ లో గ్లో లేదు, స్టెరాయిడ్స్ వలన తగ్గిపోతుందని హేటర్స్ ట్రోల్ చేస్తున్నారు. వీటిని చూసి విసిగిపోయిన సమంత తన హేటర్స్‌తో ఒక డీల్ ఫిక్స్ చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ అప్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి, “మీరు ముందు ఈ ఫుల్ అప్స్‌లో 3 చేయండి, అప్పటివరకూ నన్ను సన్నగా ఉన్నావు, అనారోగ్యంగా ఉన్నావు అని కామెంట్స్ చేయొద్దు. ఒకవేళ చేయలేకపోతే అలాంటి కామెంట్స్ మానుకోండి” అని సవాల్ విసిరింది. దీనిపై నెటిజన్లు, “ఫుల్ అప్స్ చేస్తే కామెంట్స్ చేయోచ్చా?” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సమంత సినిమా విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది. ఇంకోవైపు, రాజ్ నిడిమోరుతో ఆమె రిలేషన్‌లో ఉందని రూమర్స్ వస్తున్నాయి. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ డైరెక్టర్ రాజ్, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’తో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. మరి, ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.

 

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!