Samantha Rumours: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతున్న వార్త తెలిసిందే. గత రాత్రి నుంచి సమంత పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. సమంత, రాజ్ ల పెళ్లి అయిపోయిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే కొందరు మాత్రం అలాంటిది ఏమీ లేదు. వైరల్ అవుతున్న ఫోటోలు పెళ్లికి సంబంధించినవి కాదు. ఆ ఫోటోలు ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా కు సంబంధించినవి అని చెబుతున్నారు. దీనికి సంబంధించి వీడియో కూడా ఉండటంతో ఇందంతా నిజం కాదు అని కొట్టిపడేస్తున్నారు.
Read also-Euphoria Teaser: గుణశేఖర్ ‘యుఫోరియా’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఏం థ్రిల్ ఉంది మామా..
అయితే కొందరు బాలీవుడ్ ప్రముఖులు రాజ్, సమంత సోమవారం ఉదయం తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో ఉన్న ప్రఖ్యాత ఇషా యోగా సెంటర్‌లో ఏడడుగులు వేశారని, ఈ వివాహ వేడుక అత్యంత గోప్యంగా, కేవలం కొంతమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిందని చెప్పుకొచ్చారు. “వివాహం ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం ఉదయం జరిగింది.” అని ఒక అంతర్గత వర్గం వెల్లడించింది. ఈ వేడుకకు మొత్తం 30 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారని కూడా చెప్పుకొచ్చారు. అయతే ఏది నమ్మాలో, ఏది నమ్మ కూడదో తెలియని అయోమయంలో ఉన్నారు.
Read also-Bigg Boss Telugu 9: ఇమ్మాన్యూయేల్ వ్యవహారంపై ఫైర్ అయిన రీతూ.. డీమాన్ పవన్ కాన్ఫిడెన్స్ ఏంటి భయ్యా..
రాజ్, సమంత మధ్య సాన్నిహిత్యం ఎలా మొదలైంది అంటే.. 2024 ఆరంభంలో మొదలైందని కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత గత ఏడాదిగా సమంత ఏమాత్రం దాపరికాలు లేకుండా రాజ్‌తో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకుంటూ వచ్చారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఆ ఫొటోలు చెప్పకనే చెప్పాయి. ఇక సమంత గతంలో ప్రముఖ నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు. పెళ్లైన నాలుగేళ్ల తర్వాత వారు విడిపోయారు. నాగ చైతన్య ఆ తర్వాత నటి శోభిత ధూళిపాళను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన రాజ్-సమంత వివాహంతో, గత కొద్ది నెలలుగా నడుస్తున్న ఊహాగానాలకు తెరపడింది. బాలీవుడ్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే సమంతపై వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తెలియాలి అంటే వారు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
