Saiyaara Movie( image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Saiyaara Movie: బాక్సాఫీస్ బద్దలుగొడుతున్న ‘సైయారా’ సినిమా… 6వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?

Saiyaara Movie: అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన సైయారా సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా జూలై 18న బాక్సాఫీసు ముందుకొచ్చి, టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. మౌత్‌ టాక్‌ పవర్‌ ఏంటో మరోసారి రుజువు చేసింది. ఈ చిత్రం 6వ రోజు 200 కోట్ల రూపాయల మార్కును దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు కలెక్షన్లతో పోలిస్తే ఆరవ రోజు సినిమా కలెక్షన్స్‌లో చాలా తేడా కనిపించింది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఒక్కసారిగా కలెక్షన్లు ఆకాశాన్నంటాయి. విడుదలైన ఆరవ రోజున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. మొదటి రోజు కలెక్షన్లతో పోలిస్తే, ఆరవ రోజు గణనీయమైన పెరుగుదలను నమోదైంది. ఇది సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న భారీ ఆదరణను స్పష్టం చేస్తోంది.

Read also- Swachh Survekshan: బల్దియా లక్ష్యం స్వచ్ఛ సర్వేక్షణ్‌లో టాప్ రావడమే!

అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా అరంగేట్రం చేసిన రొమాంటిక్ డ్రామా ‘సైయారా’ 6వ రోజున పాన్ ఇండియా స్థాయిలో సుమారు రూ.25.50 కోట్ల గ్రాస్ (21.50 కోట్ల నెట్) వసూలు చేసింది. విదేశీ మార్కెట్లలో కూడా సినిమా బలంగా రాణించి, అదనంగా రూ.6.75 కోట్లు సాధించింది, దీనితో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32.25 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ 29.25 కోట్ల రూపాయలతో పోల్చుకుంటే 6వ రోజు కలెక్షన్ 10 శాతం ఎక్కువగా నమోదైంది. ఇది సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన సానుకూల స్పందన, ఆదరణను సూచిస్తోంది. సెలవు రోజు కానప్పటికీ, కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రేడ్ అంచనాలను తలకిందులు చేస్తూ అన్ని ప్రాంతాల్లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తోంది.

Read also- Indian Origin: గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్‌లో చేరిన భారత టెక్కీ.. నెట్టింట షాకింగ్ పోస్ట్!

‘సైయారా’ చిత్ర దర్శకుడు మోహిత్ సూరి, ఎక్స్ వేదికగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ధన్యవాదాలు తెలిపారు. తాను సందీప్ అభిమానినని చెబుతూ, మోహిత్ ఇలా రాసుకొచ్చారు. ‘సందీప్, సైయారా సినిమాకు మొదటగా మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. నేను ఆరాధించే దర్శకుడి నుంచి ఇలాంటి మద్దతు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు చాలా విలువైనది. మీరు మీ కథల్లో చూపించే నిజమైన భావోద్వేగం, నిర్భయత్వాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. మనం తీసే సినిమాలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయేలా తీస్తాము. మీరు తీసే సినిమాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. వాటికి నేనే అభిమానిని’ అంటూ రాసుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ