Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. బుచ్చిబాబు ఎమోషనల్!
Sahakutumbanam (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!

Sahakutumbanam: హెచ్‌ఎన్‌జి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన, దర్శకత్వంలో.. మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా నిర్మించిన చిత్రం ‘సఃకుటుంబానాం’ (Sahakutumbanam). డిసెంబర్ 12వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో రామ్ కిరణ్ (Ram Kiran), మేఘ ఆకాష్ (Megha Akash) జంటగా నటిస్తున్నారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) చేతుల మీదుగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

Also Read- Jailer 2: ‘జైలర్ 2’లో గెస్ట్ రెల్ చేసేది బాలయ్య కాదట.. ఎవరంటే?

నా స్నేహితుడు రాసిన లైన్‌తో..

ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ సార్లతో ‘నాన్నకు ప్రేమతో, ఆర్య 2’ చిత్రాలకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఇప్పుడు వారి పక్కన నిలబడి డైరెక్టర్‌గా మాట్లాడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా స్నేహితుడు విక్రమ్ అనే అతను ఒక లైన్ రెడీ చేసుకుని, సినిమాగా చేయాలని అనుకున్నాడు కానీ, అతను చనిపోయాడు. అదే లైన్‌ను తన స్నేహితుడు ఉదయ్ ఒక కథగా మార్చి.. ఆ కథతో సినిమా చేస్తున్నాను అని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ఈ సినిమా మా గురువు సుకుమార్ ఐడియాలో ఉండబోతుంది. ‘సఃకుటుంబానాం’ చిత్రం మంచి విజయం సాధించాలని.. నటీనటులకు, నిర్మాతకు, సాంకేతిక బృందానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిత్రయూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చారు.

Also Read- Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.. ఏంటంటే..

నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు

నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. బ్రహ్మానందం‌తో మరొకసారి కలిసిన నటించడం, మధు పనిచేసిన వారంతా ఉన్నత స్థాయిలకు వెళ్లడం, వారందరినీ ఈ స్టేజిపై చూడటం నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. ఒక నటుడు ఎంతో కాలం పాటు చిత్ర పరిశ్రమలో కనిపిస్తూ ఉండటం అనేది ఎంతో ప్రత్యేకమైన విషయం. ఒక నటుడు అలా కనిపించాలంటే తాము వేసే పాత్ర ప్రేక్షకులను అంతగా మెప్పించాలి. వివిధ ప్రాంతీయ భాష యాసలను సినిమాలలో మాట్లాడుతూ ప్రతి ప్రాంతం వారికి దగ్గర వాడిని అయ్యాను. ఒక కొత్త పాత్ర వేయాలంటూ మా దగ్గరకు కథ వచ్చిన ప్రతిసారి ఆశ్చర్యపోతూ ఉంటాము. ‘సఃకుటుంబానాం’ వంటి కథ ఈ 48 సంవత్సరాల సినీ ప్రయాణంలో నేను ఎప్పుడూ వినలేదు, చేయలేదు. ఈ సినిమా అంత ప్రత్యేకంగా ఉండబోతుంది. ఒక మనిషికి కుటుంబం ఎంత అవసరమనేది తెలియజేస్తూ, కుటుంబ నేపథ్యంలో కుటుంబ గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలుపుతూ రానున్న చిత్రమే ‘సఃకుటుంబానాం’ అని తెలిపారు. ఈ సినిమాలో నా పాత్ర చాలా చిత్రంగా ఉంటుందని అన్నారు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఏం మిగిలింది?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hyderabad Crime: చెంగిచెర్లలో వరుస దొంగతనాలపై క్లూ సేకరించిన పోలీసులు..?