Ram Pothineni ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Ram Pothineni: ఆ హీరోయిన్ తో పెళ్లి పీటలెక్కనున్న రామ్ పోతినేని.. ఆమె కోసం అలాంటి పని..?

Ram Pothineni: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అయితే, గత కొంత కాలం నుంచి ప్రేమ, పెళ్లి అంటూ రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన వయసులో ఉన్న హీరోలంతా వివాహాలు చేసుకుని జీవితంలో స్థిరపడుతుంటే, రామ్ మాత్రం బ్యాచిలర్ లైఫ్‌ను ఆస్వాదిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఆంధ్రా కింగ్’ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే, ఈ యంగ్ హీరో ప్రేమ జీవితం గురించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం, రామ్ పోతినేని తన ‘ఆంధ్రా కింగ్’ సహనటి భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అంతకుముందు, రామ్‌తో అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నారని, వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా రూమర్స్ వినిపించాయి. అయితే, అనుపమ తల్లి సునీత ఈ వార్తలను ఖండిస్తూ, అవి పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

Also Read: BRS on Congress: బీఆర్ఎస్ విలీనం ప్రచారాన్ని ఎండగట్టాలి.. నేతలకు మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

తాజాగా, మరోసారి రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ మధ్య లవ్ ఎఫైర్ ఉందనే చర్చలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఊహాగానాలకు ఊతమిచ్చిన ఘటన ఏమిటంటే, అనుపమ నటించిన ‘పరదా’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ పోతినేని కూడా రావడం. ఈ ఈవెంట్‌లో రామ్, అనుపమ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నారు. అనుపమ కూడా రామ్‌ను తన ఇండస్ట్రీలోని బెస్ట్ ఫ్రెండ్‌గా పేర్కొంటూ, పిలవగానే రామ్ వచ్చాడంటూ.. ఈవెంట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. అయితే, నెటిజన్లు వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదు, ప్రేమే ఉందని గట్టిగా నమ్ముతున్నారు.

Also Read: SKN Producer: ప్రతి క్రాఫ్ట్ వాళ్లు.. మీరు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోండి.. కుండబద్దలు కొట్టేసిన నిర్మాత ఎస్‌కెఎన్

“వీరిద్దరి మధ్య ప్రేమ లేదనడానికి ఎలాంటి కారణాలూ లేవు, కానీ ప్రేమ ఉందని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు. రామ్‌కు, భాగ్యశ్రీ బోర్సేతో రిలేషన్‌షిప్ ఉందనే వార్తలను కాసేపు పక్కన పెడితే, అనుపమతోనే ఆయన డేటింగ్‌లో ఉన్నారని కొందరు చర్చిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో రామ్, అనుపమల స్నేహ బంధం గురించిన మాటలు నెటిజన్లను మరింత రెచ్చగొట్టాయి. “స్నేహం అని చెప్పినా, ఇది స్పష్టంగా ప్రేమే” అంటూ ట్రోలర్స్ వీరిని టార్గెట్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై రామ్ లేదా అనుపమ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలు ఆగవు.

Also Read: KTR on Congress govt: ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఖతం పట్టించింది.. కేటీఆర్ సంచలన కామెంట్స్!

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!