Ritu Varma
ఎంటర్‌టైన్మెంట్

Ritu Varma: రీతూ వర్మ ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటుందో తెలుసా?

Ritu Varma: సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా నటిస్తున్న ఆయన ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ ‘మజాకా’ (Mazaka). సందీప్ కిషన్ 30వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి ‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. సందీప్ సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. అందులో భాగంగా హీరోయిన్ రీతూ వర్మ మీడియాకు చిత్ర విశేషాలను చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడుతూ..

నన్ను ఆకర్షించిన అంశాలివే
రైటర్ ప్రసన్న కుమార్ ఈ కథ చెప్పినపుడు అద్భుతంగా అనిపించింది. కథ హై ఎమోషనల్ కోషేంట్‌గా వుంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్‌కి ఈ కథలో చాలా ప్రాముఖ్యత వుంది. ఆయన ఇచ్చిన నెరేషన్ నాకు చాలా నచ్చింది. ఆయన కథ చెబుతున్నంతసేపూ నవ్వుతూనే వున్నాను. ముఖ్యంగా సెకండాఫ్‌లో నాకు, రావు రమేష్ పాత్రకు ఓ సింగిల్ టేక్ సీన్ వుంది. ఆ సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆ సీన్‌కి డబ్బింగ్ చెప్పిన తర్వాత రావు రమేష్ ఫోన్ చేసి.. ‘చాలా అద్భుతంగా చేశావమ్మా.. నా 16 ఏళ్ల కెరీర్‌లో అలాంటి సీన్ చూడలేదు’ అని చెప్పడం ఎంతో మెమోరబుల్‌గా అనిపించింది. అలాగే బాటిల్ రీల్‌కి మంచి స్పందన రావడం చాలా ఆనందాన్నిచ్చింది.

Also Read- GV Prakash – Saindhavi: వారి విడాకులకు కారణం నేను కాదు.. నటి సంచలన వ్యాఖ్యలు!

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా
దర్శకుడు త్రినాధరావు చేసిన అన్ని సినిమాలు ఎంతో వినోదాత్మకంగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. లాట్స్ ఆఫ్ కామెడీ. అంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. విడుదలకు ముందే సినిమాపై పాజిటివ్ వైబ్స్ రావడానికి అదే కారణం. దర్శకుడు త్రినాధరావు జోవియల్ పర్శన్. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా వుంటారు. సెట్స్‌లో అందరినీ ఆయన అంతే ఎనర్జీతో ఉంచుతారు. ఆయనతో షూటింగ్ గురించి చెప్పాలంటే ప్రతిరోజూ ఒక పండగలా వుంటుంది. త్రినాధరావు, ప్రసన్న వెరీ గుడ్ కాంబో. సందీప్ కిషన్ లవ్లీ కోస్టార్. చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అన్షు పాజిటివ్ పర్సన్. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటుంది. తన రీ ఎంట్రీ ఎలా ఉంటుందో అని నేను చాలా ఎగ్జయిటెడ్‌గా వేచి చూస్తున్నాను. నిర్మాతలు అనిల్, రాజేష్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. వారితో మరో సినిమా చేయాలనేంతగా టీమ్‌ని చూసుకున్నారు. ఈ సినిమాలో నేను యంగ్ కాలేజ్ గర్ల్ పాత్రలో కనిపిస్తాను. నా పాత్రను చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఇప్పటి వరకు నేను ఇలాంటి పాత్రలో అయితే కనిపించలేదు. కచ్చితంగా నా కెరీర్‌లో చేసిన కొన్ని గొప్ప పాత్రలలో ఒకటిగా ఈ పాత్ర నిలిచిపోతుందని నమ్మకంగా చెప్పగలను.

Heroine Ritu Varma
Heroine Ritu Varma

మల్టీస్టారర్ సైన్ చేశా
నాకు యాక్షన్, కామెడీ పాత్రలతో పాటు, ఫుల్ లెంత్ పీరియడ్ ఫిల్మ్ చేయాలనేది కల. ఇప్పటి వరకు నేను నటిగా చాలా మంచి పాత్రలు చేశాను. అందులో కొన్ని గుర్తు పెట్టుకునే పాత్రలు కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంటుంది. నా కెరీర్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. ‘పెళ్లి చూపులు 2’ కోసం నేను కూడా వేచి చూస్తున్నాను. ప్రస్తుతం తెలుగులో ఓ మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశాను. హాట్ స్టార్ కోసం ఓ వెబ్ సిరీస్‌లో చేశాను.

ఇవి కూడా చదవండి:

Vishwak Sen: ఇకపై తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నా.. విశ్వక్ ఎమోషనల్ లెటర్

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!