Raviteja ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?

Mass Jathara: మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్‌కు ఇది డబుల్ డోస్ అని చెప్పుకోవాలి. ఆయన నటించిన మాస్ జాతర సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ గ్యాప్ లేకుండా జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా రాబోతున్నాడని తాజాగా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ కార్యక్రమం అక్టోబర్ 28న (మంగళవారం) హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోతోంది.

అయితే రవితేజ, సూర్య ఇద్దరూ ఒకే స్టేజ్‌పై సందడి చేయబోతుండటంతో ఫ్యాన్స్‌లో జోష్ పీక్స్‌లో ఉంది. “మాస్ మీట్స్ క్లాస్” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బాస్ సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “అక్టోబర్ 31న సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అయితే, ఒక రోజు ముందు, అంటే 30వ తేదీ రాత్రి ప్రీమియర్ షోస్ కూడా వేసే అవకాశం ఉంది” అని చెప్పారు.

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. మాస్ జాతర రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. సామజవరగమన, వాల్తేరు వీరయ్య సినిమాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు.

ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల, భీమ్స్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన పాటలతో మాస్ ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ అయింది. సూర్య ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రాబోతున్నాడన్న వార్తతో టాలీవుడ్ ఫ్యాన్స్ , కోలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌లో ఉన్నారు. రవితేజ ఎనర్జీ, సూర్య క్లాసీ స్టైల్ కలిస్తే ఈ ఈవెంట్ రెండు ఇండస్ట్రీల్లోనూ సంచలనం కావడం పక్కా అని అంటున్నారు. మరి, ఈ మూవీతో రవితేజ తన సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో ? లేదో చూడాలి.

Just In

01

Spring Onions Benefits: ఉల్లికాడ‌ల‌ వలన ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!

MLC Kavitha: త్వరలో వారి చిట్టా బయటపెడతా అంటూ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

Bigg Boss 9 Telugu: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. ఎందుకు డిఫెన్స్ చోసుకోలేదు.. కళ్యాణ్‌ను రఫ్పాడించిన శ్రీజ!

KTR: తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: కేటీఆర్