Ranaveer
ఎంటర్‌టైన్మెంట్

Ranaveer | కేంద్రం నోటీసులు.. ఆ వివాదాస్పద వీడియో డిలీట్ చేసిన యూట్యూబ్..!

Ranaveer | యూట్యూబ్ లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన వీడియోను యూట్యూబ్ సంస్థ డిలీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంతో యూట్యూబ్ యాక్షన్ తీసుకుంది. ముంబైకి చెందిన ప్రముఖ యూట్యూబర్ రణవీర్ (Ranaveer) అల్హాబాదియా చేసిన పాడ్ కాస్ట్ వీడియో దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. తన షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రులు, శృంగారం గురించి అత్యంత అసభ్యకరంగా ప్రశ్నలు అడిగాడు రణవీర్. దాంతో వివాదం చెలరేగింది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు ఆ వీడియోపై.

దీంతో కేంద్ర సమాచార శాఖ ఈ వీడియోను డిలీట్ చేయాలంటూ యూట్యూబ్ కు నోటీసులు పంపింది. దెబ్బకు యూట్యూబ్ దిగొచ్చి ఆ వీడియోను డిలీట్ చేసింది. అలాంటి ప్రశ్నలు వేయడంపై ఇప్పటికే రణవీర్ క్షమాపణలు చెప్పాడు. అయినా సరే వివాదం మాత్రం ఆగట్లేదు. ఇలాంటి అసభ్యకర వీడియోలపై పార్లమెంట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!