Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టు ‘పెద్ది’ సినిమాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రాజెక్టులను సైతం పక్కన పెట్టి పెద్ది సినిమాకు టైం కేటాయిస్తున్నారు. బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చరణ్ పూర్తి కమిట్‌మెంట్ చూపిస్తూ, పర్ఫెక్షన్ కోసం మరింత టైం కేటాయిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్‌ను జనవరి 2026 వరకు పొడిగించాలని నిర్ణయించారు. మొదటగా ఈ సినిమా ఈ డిసెంబర్ పో పూర్తి చెయ్యాలనుకున్నారు. కానీ లేట్ అయ్యేలా కనిపిస్తుంది. ఈ నిర్ణయం రామ్ చరణ్ తర్వాత చేయబోయే సినిమాలపై ప్రభావం చూపనుంది. అయినా సరే పెద్ది సినిమాను రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. పెద్ది తర్వాత డిసెంబర్ 2025లో సుకుమార్‌తో కలిసి RC17 ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయాలని, లేదా బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ భట్‌తో కలిసి బ్యాకప్ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి, బుచ్చి బాబుకు పూర్తి క్రియేటివ్ స్పేస్ ఇవ్వాలని చరణ్ నిర్ణయం తీసుకున్నారు.
Read also-Mirai OTT release: ‘మిరాయ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?
రామ్ చరణ్ కెరీర్‌లో ‘పెద్ది’ అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ఈ సినిమా రూరల్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో చరణ్ ఒక గ్రామీణ యువకుడిగా కనిపించబోతున్నాడు. దర్శకుడు బుచ్చి బాబు ‘రంగస్థలం’ లో చరణ్‌తో పని చేసిన అనుభవం ఆధారంగా, ఈ ప్రాజెక్ట్‌లోనూ అదే ఎనర్జీ, ఎమోషన్‌లు ఉంటాయని అంచనా. ప్రస్తుతం హైదరాబాద్ కీలక షెడ్యూల్స్ జరుగుతున్నాయి. మార్చి 27, 2026లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏఆర్ రెహమాన్ అదిరిపోయే పాటలు రెడీ చేశారని టాక్.
Read also-Minister Sridhar Babu: పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన ప్రదేశం తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు
‘రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోతున్న RC17పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూట్ మే 2026 నుంచి ప్రారంభమవుతుంది. సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్నారు. ఈ చిత్రం ఒక ఎపిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతుందని సమాచారం. చరణ్ ఈ ప్రాజెక్ట్‌లో డ్యూయల్ రోల్స్ చేయబోతున్నాడని కూడా టాక్. రామ్ చరణ్ ఈ నిర్ణయంతో తన కమిట్‌మెంట్‌ను మరోసారి నిరూపించాడు. ‘పెద్ది’లో అతను ఫుల్ ఫోకస్ పెట్టడం వల్ల, సినిమా క్వాలిటీకి ఎటువంటి రాజీ ఇవ్వకుండా చూస్తున్నాడు. ఇది ఇండస్ట్రీలో చరణ్ ప్రొఫెషనలిజంకు మరో ఉదాహరణ. మరోవైపు, నిఖిల్ భట్ ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టారు. బాలీవుడ్‌లో చరణ్ ఎంట్రీకి ఇది మంచి అవకాశం కావచ్చు, కానీ ప్రస్తుతం ‘పెద్ది’ మాత్రమే ప్రయారిటీలో ఉంది.
